ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి యాంక‌ర్ శ్యామ‌ల‌

వైసీపీ మ‌ద్ద‌తుదారైన యాంక‌ర్‌, బిగ్‌బాస్ ఫేం ఆరె శ్యామ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీలో మార్పులు, చేర్పులు చేప‌ట్టారు. ఇందులో భాగంగా జిల్లాల‌కు కొత్త అధ్య‌క్షుల నియామ‌కం చేప‌ట్టారు.…

వైసీపీ మ‌ద్ద‌తుదారైన యాంక‌ర్‌, బిగ్‌బాస్ ఫేం ఆరె శ్యామ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీలో మార్పులు, చేర్పులు చేప‌ట్టారు. ఇందులో భాగంగా జిల్లాల‌కు కొత్త అధ్య‌క్షుల నియామ‌కం చేప‌ట్టారు. అలాగే సీనియ‌ర్ నాయ‌కుల్ని అధికార ప్ర‌తినిధులుగా నియ‌మించారు.

తాజాగా వైసీపీ అధికార ప్ర‌తినిధులుగా భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, జూపూడి ప్ర‌భాక‌ర్‌రావు, ఆర్కే రోజా, ఆరె శ్యామ‌ల‌ను నియ‌మించారు. వీరిలో భూమ‌న‌, జూపూడి, ఆర్కే రోజా వైసీపీ క్రియాశీల‌క రాజ‌కీయాల్లో భాగ‌మైన నేత‌లు. కానీ శ్యామ‌ల మాత్రం ఎన్నిక‌ల సంద‌ర్భంలో మాత్ర‌మే ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి అనంత‌రం ఆ పార్టీలోని కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుతుండ‌డం, పార్టీని వీడ‌డం చూస్తున్నాం.

అయితే యాంక‌ర్ శ్యామ‌ల మాత్రం ధైర్యంగా రాజ‌కీయాల్లో చురుగ్గా పాల్గొన‌డానికి ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. పైగా వైసీపీ ప్ర‌తినిధిగా ప్ర‌త్య‌ర్థుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డానికి బాధ్య‌త‌లు తీసుకున్న‌ ఆమె ధైర్య‌సాహ‌సాల్ని ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శంసిస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా పిఠాపురం వేదిక‌గా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను విమ‌ర్శించిన శ్యామ‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు శ్యామ‌ల‌పై తీవ్ర‌స్థాయిలో ట్రోలింగ్ చేశారు. అయిన‌ప్ప‌టికీ ఆమె వాటిని లెక్క చేయ‌లేదు.

శ్యామ‌ల భ‌ర్త న‌ర‌సింహారెడ్డి క‌డ‌ప నివాసి. శ్యామ‌ల కోస్తా జిల్లాల స‌నాత‌న బ్రాహ్మ‌ణ అమ్మాయి. శ్యామ‌ల భ‌ర్త సినీ రంగంలో ప‌ని చేస్తున్నారు. భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ గ్లామ‌ర్ రంగంలో ప‌ని చేస్తున్నారు. వైసీపీ త‌ర‌పున ప‌ని చేస్తే అవ‌కాశాలు పోతాయ‌నే భ‌యం లేకుండా, ముందుకొచ్చిన శ్యామ‌ల‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏ మేర‌కు అండ‌గా వుంటార‌నేది ప్ర‌శ్న‌. బ‌హుశా ఆమె వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేయాల‌ని అనుకుంటున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా వైసీపీ క‌ష్ట స‌మ‌యంలో శ్యామ‌ల ఆ పార్టీ ప్ర‌తినిధిగా మాట్లాడాల‌ని ముందుకు రావ‌డం, ఆ పార్టీకి కొండంత బ‌లం.

31 Replies to “ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి యాంక‌ర్ శ్యామ‌ల‌”

  1. ఏది ఏమైనా శ్యామల ఆమె భర్త వైసీపీ లోకి రావడానికి అన్ని అర్హతలు సంపాదించాకే వస్తుండడం అభినందనీయం ఆమె భర్త జనాల్ని మోసం చేసి 3 కోట్లు ముంచాడు ఈమె సంగతి 12000 డాలర్స్ గురించి అందరికీ తెలిసిందే

  2. కొడాలి నాని,పేర్ని నాని,ద్వారంపూడి లాంటి భాషాపండితులు ఉండాలి అధికార ప్రతినిధులు గా ..

    జూపూడి, శ్యామల లాంటి వారు పనికి రారు ..

    1. శ్యామల గారిని మీరు తక్కువగా అంచనా వేశారు, వీళ్ళందరికన్నా మిన్నగా పనికివస్తారు చూడండి!!

        1. రాత్రికి ఆడోళ్ళని ఉపయోగించుకునే, ఉపయోగించే జాతిలో పుట్టిన నీకు అంతకంటే ఏమి తెలుస్తుందిలే! ఇక బూతుల పంచాంగం మొదలు పెట్టు! నెక్స్ట్ అదే కదా

          1. కింద సంతకం l/k అని పెట్టావు అంటే నీది l/k జాతి అని అర్ధం అవుతోంది…… నీ నిజాయితీ కి హాట్స్ ఆఫ్ l/k…..

    1. ఊరుకో వయ్య స్వామి .. పైన ఉన్న అసలు మా అన్నకే లేదు సబ్జెక్టు .. డబ్బింగ్ ఆర్టిస్ట్ ల పేపర్ లో ఉన్నది చదువుతాడు .. కింద ఉన్నోళ్లకి సబ్జెక్టు తో పనేంటి ..భూతులు వొస్తే చాలు ..

  3. గుంపులో గోవిందా అంటూ ఒక నియోజకవర్గం కి ప్రచారానికి వచ్చిన ఒక పర్సన్ ఒక పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి……….. ఏంటబ్బా పార్టీ పరిస్థితి……. ఎవరు లేక… లేకపోతే…..

  4. జగన్ని జనాలు విపరీతం గా అభిమానించారు ఒకప్పుడు..అతను అందర్నీ వదిలేశాడు అధికారం వచ్చాక..జనాలు ముఖ్యం గా రాయలసీమ వాళ్ళు జగన్ నమ్మకద్రోహం తట్టుకోలేకపోయారు..cbn లాంటి వాళ్ళ మీద పెద్ద హోప్స్ లేవు జనాలకి, సో వాళ్ళు ఏదైనా మోసం లాంటిది చేసిన ఒకే అనుకుంటారు, జగన్ తో ఏమంటే అతను జనాలకి నేను వైఎస్ఆర్ కొడుకుని మాట తప్పను అన్నాడు, కానీ ప్రతి వైఎస్ఆర్ కి రివర్స్ గా చేసాడు..ఎంతల జనాలు చీ కొడుతున్నారు అంటే ,అతను వైఎస్ఆర్ కొడుకు కాదు అనేలా, ఇంతటి ద్వేషాన్ని అభిమానం గా మార్చుకొని తిరిగి జగన్ అధిరం లోకి రాగలాడ అంటే అది అనుమానమే..ఒకవేళ వచ్చినా నమ్మిన అభిమానులకు యేమి అవ్వదు..వాళ్ళు అతని కోసం ఇంకెప్పటికి పని చేయరు..కాబట్టి తటస్థ ఓటర్ల మద్దతు మరియు మిగతా జనం ప్రేమ తో రావాలి..let us see

  5. జగన్ని జనాలు విపరీతం గా అభిమానించారు ఒకప్పుడు..అతను అందర్నీ వదిలేశాడు అధికారం వచ్చాక..జనాలు ముఖ్యం గా రాయలసీమ వాళ్ళు జగన్ నమ్మకద్రోహం తట్టుకోలేకపోయారు..cbn లాంటి వాళ్ళ మీద పెద్ద హోప్స్ లేవు జనాలకి, సో వాళ్ళు ఏదైనా మోసం లాంటిది చేసిన ఒకే అనుకుంటారు, జగన్ తో ఏమంటే అతను జనాలకి నేను వైఎస్ఆర్ కొడుకుని మాట తప్పను అన్నాడు, కానీ ప్రతి వైఎస్ఆర్ కి రివర్స్ గా చేసాడు..ఎంతల జనాలు చీకొడుతున్నారు అంటే ,అతను వైఎస్ఆర్ కొడుకు కాదు అనేలా, ఇంతటి ద్వేషాన్ని అభిమానం గా మార్చుకొని తిరిగి జగన్ అధిరం లోకి రాగలాడ అంటే అది అనుమానమే..ఒకవేళ వచ్చినా నమ్మిన అభిమానులకు యేమి అవ్వదు..వాళ్ళు అతని కోసం ఇంకెప్పటికి పని చేయరు..కాబట్టి తటస్థ ఓటర్ల మద్దతు మరియు మిగతా జనం ప్రేమ తో రావాలి..let us see

  6. జగన్ని జనాలు విపరీతం గా అభిమానించారు ఒకప్పుడు..అతను అందర్నీ వదిలేశాడు అధికారం వచ్చాక..జనాలు ముఖ్యం గా రాయలసీమ వాళ్ళు జగన్ నమ్మకద్రోహం తట్టుకోలేకపోయారు..cbn లాంటి వాళ్ళ మీద పెద్ద హోప్స్ లేవు జనాలకి, సో వాళ్ళు ఏదైనా మోసం లాంటిది చేసిన ఒకే అనుకుంటారు, జగన్ తో ఏమంటే అతను జనాలకి నేను వైఎస్ఆర్ కొడుకుని మాట తప్పను అన్నాడు, కానీ ప్రతి వైఎస్ఆర్ కి రివర్స్ గా చేసాడు..,అతను వైఎస్ఆర్ కొడుకు కాదు అనేలా, ఇంతటి ద్వేషాన్ని అభిమానం గా మార్చుకొని తిరిగి జగన్ అధిరం లోకి రాగలాడ అంటే అది అనుమానమే..ఒకవేళ వచ్చినా నమ్మిన అభిమానులకు యేమి అవ్వదు..వాళ్ళు అతని కోసం ఇంకెప్పటికి పని చేయరు..కాబట్టి తటస్థ ఓటర్ల మద్దతు మరియు మిగతా జనం ప్రేమ తో రావాలి..let us see

  7. జగన్ని జనాలు విపరీతం గా అభిమానించారు ఒకప్పుడు..అతను అందర్నీ వదిలేశాడు అధికారం వచ్చాక..జనాలు ముఖ్యం గా రాయలసీమ వాళ్ళు జగన్ నమ్మకద్రోహం తట్టుకోలేకపోయారు..cbn లాంటి వాళ్ళ మీద పెద్ద హోప్స్ లేవు జనాలకి, సో వాళ్ళు ఏదైనా మోసం లాంటిది చేసిన ఒకే అనుకుంటారు, జగన్ తో ఏమంటే అతను జనాలకి నేను వైఎస్ఆర్ కొడుకుని మాట తప్పను అన్నాడు, కానీ ప్రతి వైఎస్ఆర్ కి రివర్స్ గా చేసాడు

  8. శ్రీ రెడ్డి ఏమి పాపం చేసింది..? ఆవిడ మీద జగన్ రెడ్డి కనికరం చూపించలేదా..? బట్టలిప్పేస్తే చిన్న చూపా..?

    శ్యామల కన్నా శ్రీ రెడ్డి కి వైసీపీ జనాల్లో “ఆదరణ” ఎక్కువే..

    అంతేకాకుండా..

    వైసీపీ కి 11 సీట్లు సాధించడం లో విపరీతం గా కష్టపడిన సీమరాజా ని కూడా వదిలేశారు..

    ఇది కరెక్ట్ కాదు..

    వైసీపీ కోసం కష్టపడిన శ్రీ రెడ్డి, సీమరాజా లను వైసీపీ అధికార ప్రతినిధులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాం..

    1. ప్రత్యక్ష రాజకీయం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం..

      ఈ నామినేటేడ్ పదవులు అన్నీ ప్రజలకి సంబంధం లేని పరోక్ష రాజకీయాలే

  9. ప్రత్యక్ష రాజకీయం అంటే ఎన్నికల్లో పోటీ చేయడం..

    ఈ నామినేటేడ్ పదవులు అన్నీ ప్రజలకి సంబంధం లేని పరోక్ష రాజకీయాలే

  10. శ్యామల పార్టీకి కొండంత బలమా… ఏం రాసావు బాబూ… నీకేమైనా బుర్ర ఉందా.. ఇలాంటి భజనపరుల వల్లనే కదా జగన్ ఓడిపోయింది.. ప్రజల గొంతుగా ఉండే వాళ్ళని ఎంపిక చేస్తే బెటర్..భజన చేసే వాళ్లను కాదు..

  11. మొన్నటి ఎన్నికల్లో జనం లెవన్ తో చవన్ ప్రాష్ తినిపించిన జగమన్నని జాకీలేసి లేపునున్న యాంకర్ శ్యామల

  12. ఈమెకు అవసరమా ఇవన్నీ?ఒక చీరల షాప్ ఓపెనింగ్ కెళ్తే రెండు లక్షలు ఇస్తారు. అదే యూస్ వెళ్తే రోజుకి 15000 డాలర్స్ ఇస్తారు.

    ఇప్పుడో ఎదో లిస్ట్ లో పేరు లేకుండా చేసారని సాయం చేద్దామని వచ్చి నట్టుంది.

Comments are closed.