కమెడియన్ సత్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాడు మరోసారి. మత్తు వదలరా 2 సినిమా కు వచ్చిన టాక్ కు వన్ అండ్ ఓన్లీ రీజన్… సత్య. వాస్తవం చెప్పుకోవాలంటే సత్య ముందు తేలిపోయాడు హీరో సింహా. సపోర్ట్ ఇస్తూ సాగడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ఈ విషయం కాదు కీలకం. కమెడియన్ సత్య కోసం రాసిన రైటింగ్. ఈ జనరేషన్ లో మంచి కమెడియన్లు చాలా మంది వున్నారు. కానీ వాళ్లకు తగిన కామెడీ రాసే వాళ్లే లేరు.
సత్య, వెన్నెల కిషోర్, సప్తగిరి, సుదర్శన్, ప్రవీణ్ ఇలా చాలా మంది మంచి కమెడియన్లు వున్నారు. కానీ వారి క్యారెక్టర్లు ఏవీ క్లిక్ కావడం లేదు చాలా వరకు. దీనికి కారణం సరైన ఫన్ రైటర్లు కరువైపోవడం. ఈవారం వచ్చిన భలే వున్నాడే సినిమా క్లయిమాక్స్ లో సుదర్శన్ క్యారెక్టర్ కూడా పండింది. కానీ ఎన్ని సినిమాల తరువాత. సత్యకు ఇంత పేరు తెచ్చిన మత్తు వదలరా సినిమాలో వెన్నెల కిషోర్ పాత్ర తేలిపోయింది.
నిజానికి సింహా కాకుండా మరే హీరో వున్నా, సత్య ను ఈ రేంజ్ లో ఓవర్ షాడో చేయడానికి అంగీకరించి వుండేవారు కాదేమో? వెన్నెల కిషోర్ లాంటి స్టార్ కమెడియన్ కు సరైన పాత్ర పడి ఎన్ని రోజులు అయింది. ఒకప్పుడు ఉవ్వెత్తున పైకి లేచిన సప్తగిరికి సరైన పాత్ర పడి ఎన్నాళ్లయింది. అల్లరి నరేష్ కు సరైన కామెడీ సినిమా పడడమే లేదు.
సో, రైటింగ్ కీలకం, హీరోల సపోర్ట్ కీలకం. బ్రహ్మానందం ఓవర్ షాడో చేసినా హీరోలు ఒప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలా ఒకె అనడం లేదు. దానికి తోడు సరైన రైటింగ్ వుండడం లేదు. దాంతో కామెడీ పండడం లేదు. ఇన్నాళ్లకు ఓ మంచి కామెడీ రైటింగ్ కు సత్య తోడు కావడంతో సిన్మాకు ప్లస్ అయింది.
అయినా థియేటర్లో చూడం
vc estanu 9380537747