Advertisement

Advertisement


Home > Movies - Movie News

వాళ్లిద్దరూ అస్సలు కలిసి నటించలేదంట!

వాళ్లిద్దరూ అస్సలు కలిసి నటించలేదంట!

సినిమాలో హీరోహీరోయిన్ ఉన్న తర్వాత కాంబినేషన్ సీన్లు కామన్. డ్యూయట్లు సర్వసాధారణం. ఇప్పుడు ఇంకాస్త ముందుకెళ్లి మూతి ముద్దులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఈ వ్యవహారానికి పూర్తి దూరంగా, కాస్త కొత్తగా వస్తోంది గాడ్సే సినిమా. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఉంది. కానీ అంతా అనుకుంటున్న వ్యవహారం మాత్రం ఇందులో లేదు.

కథ ప్రకారం, గాడ్సే సినిమాలో హీరో సత్యదేవ్, హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మీమీనన్ పరిచయం అవుతోంది. సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటించలేదు. కథ ప్రకారం.. ఒకరితో ఒకరు డిజిటల్ మీడియంలో మాట్లాడుకుంటారంతే. అలా హీరోహీరోయిన్లు కలవకుండానే గాడ్సే సినిమా మొదలై, ముగుస్తుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య ఉంది కానీ కలిసి నటించలేదంటున్నాడు సత్యదేవ్. సెట్స్ లో ఆమెతో మాట్లాడ్డమే తప్ప, స్క్రీన్ మాత్రం షేర్ చేసుకోలేదని చెబుతున్నాడు. ఐశ్వర్య చాలా బాగా నటించిందని, ఆమె పాత్ర గాడ్సేలో మరో హైలెట్ అంటున్నాడు.

ఇక ఈ సినిమాలో మరో హైలెట్ కూడా ఉందంటున్నారు మేకర్స్. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ లో సత్యదేవ్ సింగిల్ టేక్ సీన్ ఉందంట. 3 నిమిషాల 26సెకెన్లు ఉండే ఈ సన్నివేశాన్ని సత్యదేవ్ సింగిల్ టేక్ లో పూర్తిచేశాడట. ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది గాడ్సే సినిమా. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?