మేకోవర్ లేదు.. మీసం మాత్రమే మారుస్తారంట

శంకర్ సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయుడులో కమల్ హాసన్, అపరిచితుడులో విక్రమ్, రోబోలో రజనీకాంత్.. ఇలా హీరోలందర్నీ ఎంతో ప్రత్యేకంగా చూపిస్తాడు శంకర్. అవసరమైతే వాళ్ల కోసం విదేశాల నుంచి…

శంకర్ సినిమాల్లో హీరోలు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతీయుడులో కమల్ హాసన్, అపరిచితుడులో విక్రమ్, రోబోలో రజనీకాంత్.. ఇలా హీరోలందర్నీ ఎంతో ప్రత్యేకంగా చూపిస్తాడు శంకర్. అవసరమైతే వాళ్ల కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా మేకప్ మెన్ టీమ్ ను రప్పిస్తాడు.

హీరోల గెటప్స్ విషయంలో ఇంత కేర్ తీసుకునే శంకర్, ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా తీస్తున్నాడు. మరి ఇందులో చరణ్ ఎలా కనిపించబోతున్నాడు? హీరో గెటప్ విషయంలో భారతీయుడు, అపరిచితుడు, రోబో సినిమాల టైపులో భారీ అంచనాలు పెట్టుకోవద్దంటోంది టీమ్.

అవును.. శంకర్ సినిమాలో రామ్ చరణ్ సింపుల్ గా కనిపించబోతున్నాడు. కాస్త మీసకట్టును మాత్రమే మార్చబోతున్నాడు. అంతకుమించి చరణ్ గెటప్, లుక్ లో పెద్దగా మార్పులు ఉండవని టీమ్ స్పష్టం చేసింది. దాదాపు ఇప్పుడు కనిపిస్తున్న గెటప్ తోనే షూటింగ్ కు వెళ్లబోతున్నాడట చరణ్.

ఈ నెల్లోనే శంకర్-చరణ్ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో సెట్ వర్క్ నడుస్తోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉంది. దాదాపు 30 నిమిషాల నిడివి కలిగిన ఆ ప్రత్యేక పాత్రను తెలుగులో చిరంజీవితో చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు యూనిట్.