ఈ హీరోలకు ప్రొడక్షన్ సమస్య లేదు

రామ్ చరణ్ స్వీయ నిర్మాణం చేపట్టి రెండు సినిమాలు తీసిన తర్వాత తాను నటుడిగా బిజీగా వుంటూ నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం కుదరదని తెలుసుకున్నాడు. అటు చిరంజీవి, ఇటు చరణ్ తమ నటనపై దృష్టి…

రామ్ చరణ్ స్వీయ నిర్మాణం చేపట్టి రెండు సినిమాలు తీసిన తర్వాత తాను నటుడిగా బిజీగా వుంటూ నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడం కుదరదని తెలుసుకున్నాడు. అటు చిరంజీవి, ఇటు చరణ్ తమ నటనపై దృష్టి పెట్టి ఇక ెమ్ ప్రొడక్షన్‌కు దూరంగా వుండాలని డిసైడ్ అయ్యారు. అగ్ర హీరోలు నిర్మాతలుగా మారడం, నిర్మాణంలో భాగస్వాములు కావడం మంచిదే కానీ ఆ వ్యవహారాలు కూడా దగ్గరుండి చూసుకోలేకపోతే నష్టపోతారు.

స్టార్ హీరోలందరూ ఇప్పుడు ప్రతి సినిమాలోను వాటా కావాలని అనుకుంటున్నారు. అంటే ప్రొడక్షన్ వ్యవహారాలపై సదరు హీరోలకు ఫుల్ కంట్రోల్ కోరుకుంటున్నారు. అయితే వాళ్లు ఇదంతా చూసుకోలేరు కాబట్టి ఎవరో ఒకరు ఆ బాధ్యతలు చూసుకునేలా చూసుకుంటున్నారు. అల్లు అర్జున్‌కి తన సినిమాల నిర్మాణ పనులు చూసుకునేందుకు అల్లు అరవింద్, బన్నీ వాస్ వున్నారు.

మహేష్ సినిమాలకు ఇకపై నమ్రత పూర్తిగా ప్రొడక్షన్ పనుల్లో ఇన్‌వాల్వ్ కానున్నారు. అందుకే ఇండిపెండెంట్‌గా ఆమె ‘మేజర్’ సినిమాను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిపి ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఇకనుంచి తన సినిమాల్లో నిర్మాణ భాగస్వామ్యం కళ్యాణ్‌రామ్‌కి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ప్రభాస్‌కి ఎలాగో యువి సంస్థ చేతిలో వుండనే వుంది. తమ వర్క్ డిస్టర్బ్ అవకుండా, అలా అని ప్రొడక్షన్‌పై కంట్రోల్ పోకుండా ఈ హీరోలంతా ఇలా జాగ్రత్త పడుతున్నారు. 

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు