తెలి‘వి’గా తప్పించుకున్న దిల్ రాజు

‘వి’ అంతటి భారీ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నారనే ప్రకటన చిత్ర పరిశ్రమలో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ రేంజ్ సినిమా కొద్ది నెలల పాటు విడుదల కాకపోవడం వల్ల…

‘వి’ అంతటి భారీ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తున్నారనే ప్రకటన చిత్ర పరిశ్రమలో చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఈ రేంజ్ సినిమా కొద్ది నెలల పాటు విడుదల కాకపోవడం వల్ల నిర్మాతకు వడ్డీ భారం మినహా పెద్ద సమస్య వుండదు. ఎందుకంటే ఈ స్థాయి సినిమాలు ఎప్పుడు విడుదలైనా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. అదీ కాక ఈ చిత్రానికి నిర్మాత దిల్ రాజు అవడం, ఆయన డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లోను వుండడంతో ఈ నిర్ణయం ఆయన తీసుకోవడంతో షాకయ్యారు.

అయితే అమెజాన్‌లో ‘వి’ చూసిన తర్వాత దిల్ రాజు తెలివితేటలు అర్థమవుతున్నాయి. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైతే ఖచ్చితంగా బ్యాడ్ టాక్ వచ్చేది. సమ్మర్‌లో ఫస్ట్ సినిమాగా విడుదల చేద్దామని ప్లాన్ చేసారు కనుక ఓపెనింగ్స్ వస్తాయని దిల్ రాజు భావించి వుండొచ్చు. కానీ ఇది మరో టైమ్‌లో వస్తే ఆ వెసులుబాటు వుండదు. సినిమా కొన్న బయ్యర్ల నుంచి కూడా నష్టాలు భర్తీ చేయమనే డిమాండ్లు వుండేవి.

అదంతా లేకుండా తనకు ఎలాంటి నష్టం రాని డీల్ రావడంతో దిల్ రాజు ఓటిటి రిలీజ్‌కి అందరినీ కన్విన్స్ చేసేసినట్టున్నాడు. ఓటిటి ద్వారా విడుదలైన చాలా చిత్రాలు థియేటర్లలో ఖచ్చితంగా ఫెయిలై వుండేవి అన్నట్టే వున్నాయి. ఎప్పుడు విడుదల చేసినా విజయానికి ఢోకా వుండదని నమ్మకం వున్నవాళ్లే థియేటర్లు తెరిచే వరకు వేచి చూడాలని ఫిక్స్ అయ్యారు.

కొంచెం కొత్తగా.. కొత్త పలుకు