వందల కోట్ల రూపాయల బడ్జెట్.. రిలీజ్ కు ముందు అదే స్థాయిలో బెట్టింగ్.. వంద కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్.. ఈ సంఖ్య మహేష్ ను ఇబ్బంది పెడుతుందా? వంద కోట్లు అన్న ప్రతిసారి మహేష్ టెన్షన్ పడుతున్నాడా?
“రిలీజ్ కు ముందే నా సినిమాలు 100 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తున్నాయనే ఒత్తిడి నాకు ఎప్పుడూ లేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. ఎందుకంటే, కెరీర్ లో ఓ స్థాయికి వచ్చాననే ఫీలింగ్ కలుగుతోంది. అంతే తప్ప వంద కోట్లు అనే నంబర్ ను ఒత్తిడిగా ఎప్పుడూ ఫీల్ అవ్వను.”
ఇలా వంద కోట్ల రూపాయల బిజినెస్ పై తన మనసులో మాట బయటపెట్టాడు మహేష్. ఇంత బిజినెస్ తో ముడిపడి ఉన్న తన సినిమా కథను ఎవ్వరితో డిస్కస్ చేయనంటున్నాడు మహేష్.
“కథల ఎంపికలో నేను పెద్దగా లెక్కలు వేసుకోను. గట్ ఫీల్ తో ముందుకెళ్తాను. నా మనసుకు నచ్చితే ఓకే చెబుతాను. కథ విన్న తర్వాత దానిపై చర్చించి నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అలా ఎప్పుడూ చర్చించను. శేష్ వచ్చి మేజర్ కథ చెబుతాను అన్నప్పుడు కూడా అలానే విన్నాను, వెంటనే ఓకే చెప్పాను. హీరోగానైనా, నిర్మాతగానైనా కథల విషయంలో నా ఆలోచన ఒకేలా ఉంటుంది.”
ఇక తన సినిమాల సీక్వెల్స్ పై స్పందిస్తూ.. ఇప్పటివరకు తనకు సీక్వెల్ ఆలోచన రాలేదని, భవిష్యత్తులో ఏదైనా అనిపిస్తే చేస్తానేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మహేష్.