దివ్యవాణి ఆరోపణలకు కనీసం కౌంటర్లు ఇవ్వలేదు, సరికదా అసలు రియాక్టే కాలేదు టీడీపీ నేతలు. ఆమె ప్రెస్ మీట్ తర్వాత అందరూ సైలెంట్ గా ఉన్నారు.
మేకప్ లు వేసుకుని నారీ-భేరి సదస్సుల్లో తాను పాల్గొనలేదంటూ డైరెక్ట్ గా వంగలపూడి అనితపై సెటైర్ వేసినా, ఆమె కూడా ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండటం గమనార్హం. పోనీ ఆమె మీడియాకి దూరంగా ఉన్నారా అంటే అదీ లేదు. అనిత నిన్న అమలాపురం ఇష్యూపై మాట్లాడారు కానీ, దివ్యవాణి ఎపిసోడ్ ని స్కిప్ చేశారు.
చంద్రబాబుని తిట్టలేదనేగా..?
దివ్యవాణి టీడీపీకి రాజీనామా చేసినా ఓ తెలివైన పని చేశారు. చంద్రబాబుపై ఆమె మాట తూలలేదు. అదే సమయంలో మధ్యలో ఉన్నవారి గురించి ఫైర్ అయ్యారు. జర్నలిస్ట్ సాయిని నానా మాటలన్నారు. దీంతో ఒకరకంగా టీడీపీలో ఇంకా ఫైర్ పుట్టలేదు. అందుకే దివ్యవాణిని అలా వదిలేశారు టీడీపీ నాయకులు.
అందులోనూ దివ్యవాణి చెప్పిన మాటలకు కౌంటర్ ఇవ్వడానికి కూడా పచ్చ బ్యాచ్ దగ్గర సమాధానం లేదు. ఒకవేళ బదులిస్తే.. వాణి మరింత రెచ్చిపోయే అవకాశమంది. అందుకే టీడీపీ నేతలంతా ఎక్కడి దొంగలక్కడే గప్ చుప్ అన్నట్టున్నారు.
టీడీపీ భయపడినట్టేనా..?
దివ్యవాణి మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టే.. ఆమెను విమర్శించేందుకు టీడీపీ సాహసించట్లేదనే వాదన కూడా వినపడుతోంది. అందులోనూ ఆమె పాయింట్ టు పాయింట్ నిశితంగా విమర్శించారు. తనను చంద్రబాబు దగ్గరకు ఎందుకు వెళ్లనీయలేదో, ఎవరెవరు అడ్డుకున్నారో పేర్లతో పాటు వివరించారు. వారంతా ఇప్పుడు తేలుకుట్టిన దొంగల్లా ఉన్నారు.
నారీ భేరీతో డబ్బులు వసూలు చేశారని కూడా పెద్ద బాంబు పేల్చారు దివ్యవాణి. దీంతో వంగలపూడి అనిత నోట్లో పచ్చివెలక్కాయ పడింది. అందరూ అందరే ఎవరూ తక్కువ తినలేదు. పాపం దివ్యవాణికి చోటివ్వలేదు. దీంతో ఆమె అందరిపై ఎక్కిదిగారు.
తన ఫోన్ లో ఉన్న వాయిస్ రికార్డింగ్ లు బయటపెడితే బ్రహ్మాండం బద్దలవుతుందని కూడా హెచ్చరించారు. దీంతో టీడీపీలో చాలామంది సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది.
ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ ఏంటి..?
చంద్రబాబుని తిట్టలేదు, పార్టీ పద్ధతుల్ని విమర్శించారు, ఇంకా పార్టీతో సఖ్యత కోరుకుంటున్నట్టే ఉన్నారు. అందుకే ఈ విషయంలో ఎవరూ పెద్దగా విమర్శించలేదు.
పార్టీ లేదు, బొక్కా లేదు అన్న అచ్చెన్నాయుడిని ఏం చేశారని కూడా ఆమె నిలదీశారు. దీంతో ఆయా విషయాలపై స్పందించాల్సి వస్తుంది కాబట్టే.. టీడీపీ మౌనం వహించినట్టు కనిపిస్తోంది.