Advertisement

Advertisement


Home > Movies - Movie News

బాక్సాఫీస్ కు బ్లాక్ డే.. అన్నీ ఫ్లాపుల మయం

బాక్సాఫీస్ కు బ్లాక్ డే.. అన్నీ ఫ్లాపుల మయం

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 సినిమాలు రిలీజయ్యాయి ఈ శుక్రవారం. కానీ వీటిలో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా మెప్పించలేకపోయింది. కనీసం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో బాక్సాఫీస్ బోసిపోయింది. ఏ సినిమాకూ వసూళ్లు లేవు. ఏ సినిమాకు మంచి టాక్ రాలేదు. వేటికవే చాప చుట్టేశాయి.

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సమ్మతమే, ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమాలకు కాస్త గట్టిగా ప్రచారం చేశారు. వీళ్లు ఓ పద్ధతి ప్రకారం, దాదాపు 3 వారాల నుంచి ప్రమోషన్ చేస్తూ వచ్చారు. కానీ థియేటర్లకు జనాల్ని రప్పించలేకపోయారు. చివరికి కిరణ్ అబ్బవరం ఫ్రీ-టికెట్ స్క్రీమ్ పెట్టినప్పటికీ, ఆక్యుపెన్సీ పెరగలేదు.

మొదటి రోజు సమ్మతమే సినిమాకు అటుఇటుగా 50 లక్షల షేర్, చోర్ బజార్ సినిమాకు కాస్త తక్కువగా 40 లక్షల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు తప్ప మిగతా సినిమాలన్నీ వాష్ అవుట్ అయ్యాయి. అన్నీ తానై ఎమ్మెస్ రాజు తీసిన 7 డేస్ 6 నైట్స్ సినిమాకు 8 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చినట్టు సమాచారం.

సమ్మతమే సినిమా వరల్డ్ వైడ్ 4 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయగా, చోర్ బజార్ సినిమాను 3 కోట్ల 50 లక్షల రూపాయలకు అమ్మారు. ఈ వసూళ్లతో, ఈ టాక్ తో ఈ సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం. ఈరోజు ఈ సినిమాలకు బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఆర్జీవీ తీసిన కొండా సినిమాతో పాటు.. గ్యాంగ్ స్టర్ గంగరాజు, సదా నన్ను నడిపే, కరణ్ అర్జున్, సాఫ్ట్ వేర్ బ్లూస్ సినిమాలకు వసూళ్లు దాదాపు శూన్యం.

ఓవరాల్ గా థియేటర్ల పరిస్థితేంటి?

ప్రస్తుతం థియేటర్లలో ఏ సినిమా నడవట్లేదు. మేజర్ చూసే జనాలు తగ్గిపోయారు. ఎఫ్3 సినిమా పేరుకి మాత్రమే థియేటర్లలో కొనసాగుతోంది. విక్రమ్ కి సినిమాకు వసూళ్లు వస్తున్నాయి కానీ అవి చెప్పుకునే స్థాయిలో లేవు. 

ఒకప్పుడు చిన్న సినిమాలు, సాధారణ సినిమాలకు కూడా ఓపెనింగ్స్ బాగుండేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. టికెట్ రేట్లు తగ్గించినా జనాలు థియేటర్లకు రావడం లేదు. ఈ డౌన్ ట్రెండ్ ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?