సుధీర్ బాబుకి కూడా బిరుదు ఇచ్చేశారోచ్

చిరంజీవిని మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్, పవన్ కల్యాణ్ పవర్ స్టార్.. ఇలా దాదాపు హీరోలందరికీ బిరుదులున్నాయి. అల్లు అర్జున్ లాంటి హీరోలైతే మధ్యలో తమ బిరుదుల్ని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.…

చిరంజీవిని మెగాస్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్, పవన్ కల్యాణ్ పవర్ స్టార్.. ఇలా దాదాపు హీరోలందరికీ బిరుదులున్నాయి. అల్లు అర్జున్ లాంటి హీరోలైతే మధ్యలో తమ బిరుదుల్ని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనిప్పుడు స్టయిలిష్ స్టార్ కాదు, ఐకాన్ స్టార్. మరి సుధీర్ బాబు బిరుదు ఏంటి? ఇప్పుడా ముచ్చట కూడా తీరిపోయింది. సుధీర్ బాబుకు కూడా ట్యాగ్ వచ్చేసింది.

ఈ హీరోకు నైట్రో స్టార్ అనే బిరుదు ఆపాదించారు సినీ జనాలు. హర్షవర్థన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సుధీర్. ఈ సినిమాకు మామా మశ్చీంద్ర అనే టైటిల్ పెట్టారు. ఈ సందర్భంగా సుధీర్ బాబుకు ఈ ట్యాగ్ తగిలించారు.

ముందుగా సుధీర్ బాబును Nitro Star గా పరిచయం చేశారు మేకర్స్. అయితే తెలుగులోకి వచ్చేసరికి అది నిట్రో లేదా నైట్రో అనే అనుమానం మొదలైంది. దీంతో మేకర్సే నైట్రో స్టార్ అంటూ తెలుగు పదాన్ని కూడా బయటపెట్టారు. దీని అర్థం ఏంటనేది మాత్రం వాళ్లు చెప్పలేదు.

ఇప్పటివరకు టైటిల్స్ లో కేవలం సుధీర్ బాబు అని మాత్రమే పడేది. రీసెంట్ మూవీ శ్రీదేవిసోడా సెంటర్ కు కూడా అలానే వేశారు. మామా మశ్చీంద్ర సినిమా నుంచి నైట్రో స్టార్ సుధీర్ బాబు అనే టైటిల్ కార్డ్ కనిపించనుంది.

కెరీర్ స్టార్ట్ చేసి చాన్నాళ్లయినప్పటికీ ఇప్పటివరకు సాలిడ్ మాస్ హిట్ అందుకోలేకపోయాడు సుధీర్ బాబు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. ఈసారి మామా మశ్చీంద్రతో ఆ కోరిక నెరవేరుతుందనే ఆశతో ఉన్నాడు.