మహేష్ ను కూడా వదిలేది లేదు – తమన్

తమన్ కు ఓ అలవాటుంది. తన హీరోలతో పాటలు పాడించడానికి ఇష్టపడతాడు ఈ హీరో. కుదిరితే కనీసం బిట్ సాంగ్ అయినా పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం తమన్ ఆటలు…

తమన్ కు ఓ అలవాటుంది. తన హీరోలతో పాటలు పాడించడానికి ఇష్టపడతాడు ఈ హీరో. కుదిరితే కనీసం బిట్ సాంగ్ అయినా పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మహేష్ బాబు విషయంలో మాత్రం తమన్ ఆటలు సాగలేదు. ఈ విషయాన్ని తమన్ కూడా అంగీకరిస్తాడు. మహేష్ తో పాడించడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన విషయాన్ని బయటపెట్టాడు.

“బిజినెస్ మేన్ లో పాడించడానికి ట్రై చేశాను. కానీ మహేష్ 2 గంటల్లో బయటకు వచ్చేశారు. ఈ వ్యవహారంతో నాకు సంబంధం లేదు బ్రదర్ అంటూ తప్పించుకున్నారు. అయినప్పటికీ పాటలో 2-3 డైలాగ్స్ చెప్పించాను. అవి ఇప్పటికీ వైరల్. చాలామంది రింగ్ టోన్స్ గా కూడా పెట్టుకున్నారు.”

ఇలా బిజినెస్ మేన్ టైమ్ లోనే మహేష్ తో పాడించడానికి ట్రై చేసిన విషయాన్ని బయటపెట్టాడు తమన్. సర్కారువారి పాటలో మహేష్ తో పాట పాడించలేకపోయానంటూ బాధపడిన ఈ సంగీత దర్శకుడు.. మహేష్ ను వదిలేది లేదని, భవిష్యత్తులో తప్పకుండా అతడితో ఓ పాట కంపోజ్ చేస్తానని శపథం చేశాడు. కుదిరితే ఓ ర్యాప్ సాంగ్ ను మహేష్ తో పాడించాలనే ఆలోచనను కూడా బయటపెట్టాడు.

దూకుడు సినిమాతో తమన్ కు అవకాశం ఇచ్చాడు మహేష్ బాబు. అందులో పాటలు నచ్చి వెంటనే బిజినెస్ మేన్ సినిమాకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మహేష్ నటించిన ఆగడు సినిమాకు తమన్ సంగీతం అందించాడు. మళ్లీ ఇన్నేళ్లకు తమన్ కు మరో ఛాన్స్ ఇచ్చాడు మహేష్. వరుసగా దేవిశ్రీప్రసాద్ తోనే పనిచేసిన ఈ హీరో, దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత తమన్ కు అవకాశం ఇచ్చాడు.