ఎన్టీఆర్ సినిమాలో ఆలియా లేనట్లేనా?

గంగూభాయ్ ప్రమోషన్ల టైమ్ లో ముంబాయి వెళ్లిన తెలుగు జర్నలిస్ట్ లకు ఆలియాభట్ పక్కా క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ సినిమాలో చేయబోతున్నట్లు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఆ కాంబినేషన్ వుండకపోవచ్చు…

గంగూభాయ్ ప్రమోషన్ల టైమ్ లో ముంబాయి వెళ్లిన తెలుగు జర్నలిస్ట్ లకు ఆలియాభట్ పక్కా క్లారిటీ ఇచ్చింది ఎన్టీఆర్ సినిమాలో చేయబోతున్నట్లు. కానీ ఇప్పుడు లేటెస్ట్ అప్ డేట్ ఏమిటంటే ఆ కాంబినేషన్ వుండకపోవచ్చు అని. దీనికి కారణం మరేమీ కాదు. 

ఆలియా భట్ ఓ హాలీవుడ్ సినిమాకు సైన్ చేయడమే. ఇప్పటికీ ఆలియా ఎన్టీఆర్ సినిమా చేస్తాననే అంటోంది. కానీ ఆమెను తీసుకుంటే సినిమా నిర్మాణ సమయం కనీసం ఆరు నెలలు ఎక్కువ పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆమె డేట్ ల కోసం చూస్తూ కొరటాల, ఎన్టీఆర్ ఇద్దరూ ఖాళీగా వుండాల్సిందే. 

ఇప్పటికే ఈ ఇద్దరూ చెరో నాలుగేళ్లు ఒక్కొ సినిమా మీద ఖర్చు చేసేసారు. అందుకే వీలయినంత త్వరగా సినిమా చేయాలనుకుంటున్నారు. కానీ అలా చేయాలంటే త్వరగా డేట్ లు ఇచ్చే హీరోయిన్ కావాలి. ఇప్పుడు అదే వెదులులాటలో వున్నారు.

నిజానికి కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత వుండదు. కానీ ఇప్పుడు చేయబోయే సినిమాలో బాగా పెర్ ఫార్మ్ చేయగల హీరోయిన్ కావాలి. అందుకే ఆలియాను తీసుకోవాలనుకున్నారు. కానీ డేట్ లు కుదరడం లేదు. అదీ విషయం.