Advertisement

Advertisement


Home > Movies - Movie News

దేవర ఆగింది.. వార్ మొదలైంది

దేవర ఆగింది.. వార్ మొదలైంది

లెక్కప్రకారం, దేవర సినిమా షూటింగ్ పూర్తిచేసి, వార్-2 సెట్స్ పైకి వెళ్లాలనేది ఎన్టీఆర్ ప్లాన్. కానీ అలా జరగలేదు. ఎన్నో కారణాల వల్ల దేవర షూట్ ఆలస్యమైంది. మరోవైపు వార్-2 షూటింగ్ టైమ్ దగ్గరపడింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య దేవర సినిమాను కొన్నాళ్లు పక్కనపెట్టాడు ఎన్టీఆర్.

అవును.. ఎన్టీఆర్ ముంబయిలో ల్యాండ్ అయ్యాడు. ఈరోజు నుంచి వార్-2 షూట్ లో పాల్గొన్నాడు. ముందుగా తారక్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా కనిపించబోతున్నాడు. సినిమాలో అతడు గూఢచారి పాత్రలో కనిపించబోతున్నాడు.

త్వరలోనే హృతిక్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సన్నివేశాలు తెరకెక్కించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది. వార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టవ్వడంతో, వార్-2పై అంచనాలు పెరిగాయి.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. హృతిక్ రోషన్ సెట్స్ పైకి వచ్చాడు కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ రాకతో ఈ సినిమా షూటింగ్ వేగం పుంజుకుంది. కియరా అద్వానీ ఇందులో హీరోయిన్. వచ్చే ఏడాది ఆగస్ట్ 14న వార్-2 సినిమా థియేటర్లలోకి వస్తుంది.

వార్-2కు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తయిన తర్వాత తిరిగి దేవర పని మొదలుపెడతాడు తారక్. రాబోయే షెడ్యూల్ లో ఎన్టీఆర్-జాన్వి మధ్య ఓ సాంగ్ తీయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?