తెలంగాణలో పొలిటికల్ గేమ్ మొదలయింది. కేసిఆర్ తన స్టయిల్ ఝలక్ ఇచ్చారని అప్పుడే వార్తలు మొదలైపోయాయి. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనాల్సిన సభకు పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి క్యాన్సిల్ కొట్టారు తెలంగాణ పోలీసులు.
రామోజీ ఫిలిం సిటీలో జరగాల్సిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి సమర్పిస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో కీలక పాత్ర ధారి.
ఇలాంటి భారీ పాన్ ఇండియా సినిమాకు దాని లెవెల్ కు తగినట్లు రామోజీ ఫిలిం సిటీలో ఫంక్షన్ ఏర్పాటు చేసారు. సరిగ్గా 24 గంటల ముందు అది కాస్తా క్యాన్సిల్ అయింది. దీని వెనుక రీజన్ మరేమీ కాదని, భాజపా దగ్గరకు ఎన్టీఆర్, రామోజీ దగ్గర కావడం తప్పవేరు కాదని అప్పుడే వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
అదే నిజమైతే అసలు సిసలు పొలిటికల్ వార్ మళ్లీ తెలంగాణలో మొదలైనట్లే. గతంలో రామోజీ ఫిలిం సిటీ మీద కేసిఆర్ కారాలు మిరియాలు నూరారు. రాచకొండ గుట్టల్లో ఫిలిం సిటీ కడతామని కేసిఆర్ ప్రకటించారు కూడా. తరువాత తుమ్మల నాగేశ్వర రావు జోక్యంతో అంతా సర్దు మణిగింది. కేసిఆర్ స్వయంగా ఫిలిం సిటీకి వెళ్లి వచ్చారు కూడా. ప్రభుత్వ ఫిలిం సిటీ హడావుడి సర్దు మణిగింది.
ఇప్పుడు చూస్తుంటే మళ్లీ అన్నీ ఒక్కొక్కటి బయటకు వచ్చేలా కనిపిస్తోంది పరిస్థితి.