ఎన్ టి ఆర్ కు విశ్రాంతి!

సినిమాల్లో చేసే ఫైట్ లు, ముఖ్యంగా రోప్ లు కట్టుకుని చేసే ఫైట్ లు హీరోలను కాస్త ఇబ్బందికి గురి చేయడం కామన్. చాలా మంది హీరోలు నడుంనొప్పులతో బాధపడడానికి కీలక కారణం ఈ…

సినిమాల్లో చేసే ఫైట్ లు, ముఖ్యంగా రోప్ లు కట్టుకుని చేసే ఫైట్ లు హీరోలను కాస్త ఇబ్బందికి గురి చేయడం కామన్. చాలా మంది హీరోలు నడుంనొప్పులతో బాధపడడానికి కీలక కారణం ఈ రోప్ ఫైట్లే. 

అలాగే లెగ్ ఇంజ‌రీ, షోల్డర్ ఇంజ‌రీల బారినపడుతుంటారు కూడా. లేటెస్ట్ గా హీరో ఎన్టీఆర్ కూడా షోల్డర్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బింబిసార సినిమా ఫంక్షన్ కు కూడా ఈ సమస్యతో బాధపడుతూనే హాజ‌రయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వైద్యులు ఎన్ టి ఆర్ ను నాలుగు వారాలు విశ్రాంతి తీసుకోమని చెప్పారని తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్ పని మీద వున్నారు. ఈ సినిమా అక్టోబర్ నుంచి కానీ ప్రారంభం కాదని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఈ విశ్రాంతి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ షోల్డర్ సమస్య తగ్గిపోవాలి. ఎన్టీఆర్ కాస్త మేకోవర్ కావాలి. అప్పుడు కానీ సినిమా షూట్ జోలికి వెళ్లకపోవచ్చు.

ఇవన్నీ చూస్తుంటే కొరటాల శివ-ఎన్ టి ఆర్ సినిమా ప్రారంభం కావడానికి కాస్త టైమ్ పట్టేటట్టే వుంది.