రామ్ చరణ్ పుట్టినరోజున మొదటగా విష్ చేసేది ఎవరు? బహుశా ఉపాసన కావొచ్చు. లేదంటే చిరంజీవి కావొచ్చు. వీళ్లిద్దరూ కాకపోతే మెగా కుటుంబ సభ్యుల్లో వేరే వ్యక్తులు కావొచ్చు. కానీ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు సరిగ్గా అర్థరాత్రి 12 కొట్టగానే ముందుగా విష్ చేసేది ఎవరో తెలుసా? అతడే ఎన్టీఆర్. అవును.. ఈ సీక్రెట్ ను స్వయంగా ఎన్టీఆర్ బయటపెట్టాడు
మార్చి 26న ఎన్టీఆర్ భార్య ప్రణతి పుట్టినరోజు. ఆ రోజంతా భార్యతో గడిపి, సరిగ్గా రాత్రి 12 గంటలకు ఇంటి నుంచి జంప్ అవుతాడంట తారక్. ఎందుకంటే, 27వ తేదీ ఎంటర్ అవుతుంది. రామ్ చరణ్ పుట్టినరోజు వస్తుంది. అర్థరాత్రి 12 గంటలకు రామ్ చరణ్ స్వయంగా తన కారుపై వచ్చి ఎన్టీఆర్ ను పికప్ చేసుకుంటాడట. ఇద్దరూ కారులో అలా వెళ్తూ చరణ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటారట.
కొన్నేళ్లుగా రామ్ చరణ్ పుట్టినరోజు ఇలానే జరుగుతోందనే సీక్రెట్ ను బయటపెట్టాడు తారక్. తన ఇంటికి స్వయంగా చరణ్ వచ్చి, కారులో ఎన్టీఆర్ ఎక్కించుకోవడంతో అతడి పుట్టినరోజు వేడుకలు మొదలవుతాయన్నాడు. ఈ విషయంలో బహుశా ప్రణతి చాలా ఫీల్ అయి ఉంటుందని చరణ్ కూడా స్టేట్ మెంట్ పడేశాడు. అలా తామిద్దరి స్నేహం కొనసాగుతోందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. తమ స్నేహం ఎక్కడ మొదలైందో కూడా వివరించాడు.
ప్రపంచానికి తెలియకముందే చరణ్-తారక్ ఫ్రెండ్స్ అంట. చాలా ఏళ్ల కిందట జరిగిన స్టార్ క్రికెట్ మ్యాచ్ లో ఎక్కువ సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారట. అప్పట్నుంచి రెగ్యులర్ గా కలుస్తూనే ఉన్నారట. అలా బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారట. తమ రెండు కుటుంబాల మధ్య సినిమాల పరంగా పోటీ ఉండడంతో తమ స్నేహాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదని, ఆ విషయం రాజమౌళికి బాగా తెలుసని ప్రకటించాడు ఎన్టీఆర్.
ప్రస్తుతం ఈ హీరోలిద్దరూ కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు. ఈ సినిమాతో తామిద్దరి మధ్య స్నేహం మరింత బలపడిందని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.