నిరుద్యోగుల్లో విశాఖ టాప్

విశాఖ ఏపీలో అన్ని విధాలుగానూ టాప్ రేంజిలో ఉంటోంది. మెగా సిటీ అని విశాఖకు పేరు. ఏపీకి గ్రోత్ ఇంజన్ అని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయాలు అలా ఉంటే ఏపీలో నిరుద్యోగం రేటు…

విశాఖ ఏపీలో అన్ని విధాలుగానూ టాప్ రేంజిలో ఉంటోంది. మెగా సిటీ అని విశాఖకు పేరు. ఏపీకి గ్రోత్ ఇంజన్ అని గొప్పగా చెప్పుకుంటారు. ఆ విషయాలు అలా ఉంటే ఏపీలో నిరుద్యోగం రేటు తీసుకుంటే అందులో కూడా విశాఖ జిల్లా ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. అంటే దాదాపుగా లక్ష మంది దాకా నిరుద్యోగులు విశాఖలో ఉన్నారని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ వద్ద నమోదైన లెక్క.

ఇదిలా ఉంటే ప్రభుత్వం దగ్గర ఇలా రికార్డు అయి ఉన్న వివరాలు తీసుకుంటే ఏపీవ్యాప్తంగా 6,16,689 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక విశాఖ అందులో 98 వేల 504 మందితో అగ్ర స్థానంలో ఉంటే ఆ తరువాత స్థానంలో కర్నూల్ 64,294 తో ఉంది. మూడవ ప్లేస్ లో కడప 58,837 నిరుద్యోగులతో ఉంది.

ఇక అట్టడుగు నుంచి చూసుకుంటే అనంతపురం జిల్లా 18,730 తో నిరుద్యోగులలో లాస్ట్ ప్లేస్ గా ఉంది. దానికి ముందు శ్రీకాకుళం జిల్లా 31,574 మందితో అడుగు నుంచి రెండవ ప్లేస్ లో ఉంది. ఇక ఇవన్నీ నిరుద్యోగులకు సంబంధించిన
లెక్కలు. ప్రభుత్వం వద్ద ఉన్నవి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించినది.

అంటే అధికారికంగా ఇంతమంది నిరుద్యోగులు ఉంటే అనధికారికంగా వారి సంఖ్య ఇంతకు పదింతలు ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా నిరుద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగం లేనివాడు అన్న అర్ధంతో చూస్తే ఏపీలో ఆరున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగులు తప్ప అందరూ నిరుద్యోగులే అన్న పరమార్ధాన్ని కూడా తీసుకోవాల్సిందే. 

సర్కార్ ఉద్యోగం అందరికీ దొరకదు కాబట్టి స్వయం ఉపాధి మార్గాల ద్వారా అయినా ఎదిగితేనే రాష్ట్రానికి సమాజానికి మేలు అని మేధావులు అంటున్న మాట.