అతిలోకసుందరి, అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తె జాన్వీ ని తెలుగు లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు గట్టిగానే జరుగుతున్నాయి. ఇప్పటికే ఓ సినిమా కమిట్ అయినట్లు వార్తలు వినవస్తున్నాయి. పూరి జగన్నాధ్ డైరక్షన్ లో తయారయ్యే జనగనమణ లో ఆమె నటించబోతోందని వార్తలు వచ్చేసాయి.
ఎన్టీఆర్ సరసన కూడా జాన్వీని తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ ఎన్టీఆర్ తో నిర్మించే సినిమాలో ఆమెను తీసుకునే ఆలోచనలు చేస్తున్నారు.
ఉప్పెనతో టాలీవుడ్ లోకి ఉప్పెనలా దూసుకువచ్చిన దర్శకుడు బుచ్చిబాబు ఓ కథను ఎన్టీఆర్ తో ఓకె చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు జాన్వీ పెర్ పెక్ట్ ఫిట్ అని యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల సినిమాకు పాన్ ఇండియా లుక్ కూడా వస్తుంది.
ఈ ఏడాది చివరకు ఈ సినిమా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది.