మరోసారి వాయిదాపడిన ఎన్టీఆర్ సినిమా

లెక్కప్రకారం, మరో 4 రోజుల్లో ఎన్టీఆర్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలి. కానీ ఇప్పుడీ సినిమా ఓపెనింగ్ మరోసారి వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్టు లాంఛ్, 24న జరగడం లేదు.…

లెక్కప్రకారం, మరో 4 రోజుల్లో ఎన్టీఆర్ సినిమాకు కొబ్బరికాయ కొట్టాలి. కానీ ఇప్పుడీ సినిమా ఓపెనింగ్ మరోసారి వాయిదా పడింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయాల్సిన ప్రాజెక్టు లాంఛ్, 24న జరగడం లేదు. త్వరలోనే మరో కొత్త తేదీని ప్రకటిస్తారు.

తారకరత్న హఠాన్మరణం నందమూరి కుటుంబాన్ని కలచివేసింది. తారకరత్న పార్థికదేహాన్ని చూసి చలించిపోయాడు  ఎన్టీఆర్. ఇలాంటి టైమ్ లో కొత్త సినిమా ఓపెనింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదని నిర్మాత భావించాడు. పైగా ఈ సినిమాకు కల్యాణ్ రామ్ సహ-నిర్మాత కూడా.

అందుకే మరో ఆలోచన లేకుండా ఎన్టీఆర్ కొత్త సినిమా ఓపెనింగ్ ను వాయిదావేశాడు నిర్మాత మిక్కిలినేని సుధాకర్. అయితే ఓపెనింగ్ వాయిదాపడినప్పటికీ, మూవీ రెగ్యులర్ షూటింగ్ లో మాత్రం ఎలాంటి మార్పుల్లేవు.

మార్చి ఆఖరి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ, శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఆల్రెడీ కాల్షీట్లు కూడా కేటాయించింది. ఆమెకు తెలుగులో ఇదే తొలి స్ట్రయిట్ మూవీ.

మరోవైపు ఈ సినిమాకు లొకేషన్లు కూడా లాక్ చేశాడు కొరటాల. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుంది. తర్వాత మిగతా షెడ్యూల్స్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఆల్రెడీ మ్యూజిక్ పనులు మొదలుపెట్టాడు

ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే. పైగా తారక్-కొరటాలది హిట్ కాంబినేషన్. అందుకే ఈ తాజా చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టలేదు.