ఓ మేజ‌ర్ బయోపిక్ లో రొమాంటిక్ సీన్లు

సోది చెప్పే బల్లి కుడితి గోలెంలో పడింది అన్నది సామెత. ఆర్ఆర్ఆర్ అనేది ఇద్దరు దేశభక్తుల పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని అల్లిన ఫిక్షన్ స్టోరీ. ఈ విషయం పదే పదే చెబుతూనే వచ్చారు దర్శకుడు…

సోది చెప్పే బల్లి కుడితి గోలెంలో పడింది అన్నది సామెత. ఆర్ఆర్ఆర్ అనేది ఇద్దరు దేశభక్తుల పాత్రలను స్ఫూర్తిగా తీసుకుని అల్లిన ఫిక్షన్ స్టోరీ. ఈ విషయం పదే పదే చెబుతూనే వచ్చారు దర్శకుడు రాజ‌మౌళి. అలాంటి ఫిక్షన్ సినిమాలో రొమాంటిక్ సీన్లు లేవన్నది క్రిటిక్స్ ఒపీనియన్. 

ఓ కమర్షియల్లీ ప్యాక్డ్ సినిమా అంటే అన్ని జానర్ లు టచ్ చేస్తుంది. చేయాలి. ఎందుకంటే ప్రేక్షకుల్లో అన్ని రకాల వాళ్లు వుంటారు. వాళ్ల భిన్న అభిరుచుల్ని సినిమా టచ్ చేయాల్సి వుంటుంది. కానీ ఈ విషయాన్ని పట్టుకుని ఓ సంస్థ తెగ ఆవేశ పడిపోయి తెగ ట్వీట్ లు వేసేసింది. దేశభక్తి సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఏమిటి అంటూ? నో రొమాంటిక్ సీన్స్ అంటూ పదే పదే కిందా మీదా అయిపోయింది.

కట్ చేస్తే అదే సంస్థ ఇప్పుడు నికార్సయిన బయోపిక్ నిర్మించింది. ఇది అస్సలు ఫిక్షన్ కాదు.సైన్యంలో పని చేసిన ఓ ఆధునిక వీరుడు అయిన మేజ‌ర్ కథతో తయారైన బయోపిక్. ఆ వీరుడి కథలో ప్రేమ వివాహం కూడా వుంటే వుండొచ్చు. ఆ విషయం ఆ వీరుడి తల్లి తండ్రులు చెబితే చెప్పి వుండొచ్చు. చెప్పినా ఏమని చెబుతారు. తమ కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు అని చెబుతారు. అంతే కానీ తమ కుమారుడి రొమాంటిక్ సీన్లు తెలుసుకుని మరీ వర్ణించరు కదా.

మరి సదరు సంస్థ ఏ విధంగా ఆ దేశభక్తి వీరుడి బయోపిక్ లో రొమాంటిక్ సీన్లు చొప్పించింది? అంటే ఇక్కడ తమ దేశభక్తి సినిమాకు రొమాంటిక్ సీన్లు అవసరం పడ్డాయా? దేశభక్తి సినిమాలో రొమాంటిక్ సీన్లేంటీ అని ఆ దర్శకుడుని, హీరోని నిలదీసి, కట్ చేయించలేకపోయారా?

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు వున్నాయి అన్నారు కదా ఆచార్య ఆత్రేయ. ఇందుకేనేమో?