ఓ మై ఆధ్య…శర్వానంద్ వెస్ట్రన్ బీట్

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి…

యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ప్ర‌తి ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కు మంచి స్పంద‌న‌ ల‌భించింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతో ఇటీవ‌ల విడుద‌ల చేసిన టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్‌ను మ‌రింత‌ పెంచడానికి సహాయపడుతోంది. ఇప్ప‌టికే సినిమా ఫస్ట్‌, టైటిల్‌ ట్రాక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రేమికుల రోజున రెండో పాట‌గా పెప్పీ అండ్ బ్రీజీ మెలోడీ ఓ ఆధ్య పాటను విడుదల చేశారు.

ఈ పాట‌లో దేవి శ్రీ ప్రసాద్ కొన్ని ఫుట్ ట్యాపింగ్ సౌండ్‌లను అందించారు. హీరోహీరోయిన్లు వారి డ్యాన్స్ స్కిల్స్ ప్రదర్శించడానికి తగినంత స్కోప్ పాట‌లో ఉంది. గిటార్ స్టెప్ మ‌రింత‌ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటను యాజిన్ నిజార్ చక్కగా ఆలపించారు.

శ్రీమణి మంచి సాహిత్యం అందించారు. పాటలో శర్వానంద్ స్టైలిష్‌గా కనిపించగా, రష్మిక మందన్న గ్లామర్‌గా కనిపించింది. ఈ పాట యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకునేలా వుంది.