శ్రీలీల ఫస్ట్ లుక్

పెళ్లిసందడి సినిమాతో మాంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత సినిమా రవితేజ‌ సరసన చేస్తోంది. ఈ మేరకు వార్తలు వచ్చాయి తప్ప అధికారికంగా లుక్ అనేది రాలేదు.  Advertisement వాలంటైన్స్ డే…

పెళ్లిసందడి సినిమాతో మాంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ఆ తరువాత సినిమా రవితేజ‌ సరసన చేస్తోంది. ఈ మేరకు వార్తలు వచ్చాయి తప్ప అధికారికంగా లుక్ అనేది రాలేదు. 

వాలంటైన్స్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నక్కిన త్రినాధరావు దర్శకుడు.

ప్రేమికుల రోజు కావడంతో రవితేజ, శ్రీలీల జంటగా ఉన్న పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో శ్రీలీల క్యూట్గా కనిపిస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల పాత్ర పేరు ప్రణవి.

ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, మాటలు అందిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్. మిగతా నటీనటులు, సాంకేతిక బృందాన్ని చిత్రయూనిట్ త్వరలోనే ప్రకటించనుంది.