మొత్తానికి ఓ అప్ డేట్ కు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. ఉగాదికి మహేష్ బాబు సినిమా నుంచి ఏ అప్ డేట్ ఇవ్వడం లేదని నిర్మాణ సంస్థ హారిక హాసిని ప్రకటించేసింది. దీని వెనుక చాలా తతంగమే నడిచినట్లు తెలుస్తోంది.
ఉగాదికి అప్ డేట్ ఇవ్వాలని ఓ మాంచి వీడియో గ్లింప్స్ కట్ చేసారు. అంతకు ముందే ఈ సినిమాకు ఒకటి రెండు టైటిళ్లు అనుకున్నారు. ఈ టైటిల్..ఆ వీడియో కలిపి ఫ్యాన్స్ కు అందివ్వాలనుకున్నారు.
కానీ వీడియో గ్లింప్స్ చూసిన తరువాత ఈ రెండు టైటిళ్లు కూడా సరిపోవని, ఇంకా అంతకు మించిన టైటిల్ కావాలని డిసైడ్ కావడానికి ఎంతో సేపు పట్టలేదు. కానీ ఆ టైటిల్ ఏమిటి అన్నది అంత సులువుగా ఫిక్స్ అయ్యే సంగతి కాదు.
టైటిల్ లేకుండా వీడియో ఇవ్వడం బాగుంటుందా? గతంలో బోయపాటి తన సినిమాలకు ఇలా ఇచ్చిన సందర్భాలు వున్నాయి. కానీ ఎంతయినా టైటిల్ తో కలిపి గ్లింప్స్ ఇస్తే వచ్చే కిక్కే వేరు. దీని మీద సోమవారం రోజంతా మల్లగుల్లాలు నడిచాయి.
ఆఖరికి రాత్రి ట్విట్టర్లో ప్రస్తుతానికి ఏ అప్ డేట్ ఇవ్వడం లేదని చెబుతూ, శ్రీరామనవమికి ఇస్తామని ఇండైరెక్ట్ గా చెప్పేసారు. సో, ఇప్పుడు బాల్ దర్శకుడు త్రివిక్రమ్ కోర్టులో వుంది. ఆయన టైటిల్ ఇచ్చేస్తే గ్లింప్స్ రెడీగా వుంది. ఫ్యాన్స్ కు అందించడమే తరువాయి. ఇందుకోసం వున్న గడువు సరిగ్గా పది రోజులు.