Advertisement

Advertisement


Home > Politics - National

అత్యంత సంతోషకరమైన దేశంగా 'ఫిన్లాండ్'

అత్యంత సంతోషకరమైన దేశంగా 'ఫిన్లాండ్'

ప్రపంచంలోనే అత్యంత సంతోష‌క‌ర‌మైన‌ దేశంగా మరోసారి ఫిన్లాండ్‌ నిలిచింది. ప్రపంచ సంతోకరమైన దేశాల జాబితాలో వరుసగా ఆరోసారి ఈ ఘ‌న‌త ద‌క్కించుకుంది. యూఎన్‌ సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్ 150కిపైగా దేశాల్లో ప్ర‌జ‌ల‌ను స‌ర్వే చేసి ఈ రిపోర్ట్ రూపొందించింది.

ఈ జాబితాలో డెన్మార్క్ రెండో స్థానంలో, ఐస్ లాండ్ మూడో స్థానంలో నిలిచారు. భార‌త్ ఈ నివేదిక‌లో నేపాల్, చైనా, శ్రీలంక కంటే దిగువ‌న 126వ స్థానంలో నిలిచింది. అలాగే ప్ర‌స్తుతం యుద్ద దేశాలు అయిన ర‌ష్యా 72, ఉక్రెయిన్ 92వ స్థానలు దక్కడం గమన్హారం. అన్నింటికంటే దిగువన 137వ స్థానంలో అఫ్ఘానిస్థాన్ నిలిచింది.

2018 నుంచి వరుసగా ఫిన్‌లాండ్ మొదటి స్థానంలో నిలవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.  విస్తారమైన అడవులు, సరస్సుల దేశంలో సక్రమంగా పనిచేసే ప్రజా సేవలు, అధికారంపై విస్తృత విశ్వాసం, తక్కువ స్థాయి నేరాలు, అసమానతలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఒక దేశ హ్యాపినెస్‌ని దాని తలసరి జీడీపీ, సామాజిక మద్దతు, ఆరోగ్యకరమైన జీవన విధానం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి తదితరాల ఆధారంగా కొలిచి హ్యాపినెస్‌ సూచీలో స్థానం కల్పిస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?