అక్టోబర్ వరకు నో ఓటిటి

తెలుగు సినిమా పరిశ్రమ కరోనా కారణంగా పలు ఒడిదుడుకులకు లోనవుతోంది. థియేటర్లు ఇప్పటికి రెండు సార్లు నెలల తరబడి మూత పడ్డాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. ఇంకా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి.  Advertisement కరోనా…

తెలుగు సినిమా పరిశ్రమ కరోనా కారణంగా పలు ఒడిదుడుకులకు లోనవుతోంది. థియేటర్లు ఇప్పటికి రెండు సార్లు నెలల తరబడి మూత పడ్డాయి. షూటింగ్ లు ఆగిపోయాయి. ఇంకా అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. 

కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో థియేటర్లు మళ్లీ తెరవాల్సి వుంది. కానీ ఆంధ్రలో థియేటర్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. పైగా అక్కడ టికెట్ రేట్లు అనుకూలంగా లేవు. అందువల్ల సినిమాల విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు ఓటిటి దారి పడుతున్నాయి. దాంతో ఎగ్జిబిటర్లలో కలవరం బయలుదేరింది.

ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు అంతా ఈ రోజు సమావేశం అయ్యారు. తొందరపడి ఓటిటికి సినిమాలు ఇవ్వవద్దని నిర్మాతలను కోరాలని ఈ సమావేశంలో తీర్మానం చేసారు. ఓటిటి వ్యవహారాలు ఇప్పుడు బాగానే వున్నా, భవిష్యత్ లో ఎలా వుంటుందో తెలియదని, థియేటర్ వ్యవస్థ పతనం అయిపోతే ఓటిటి అనేది మోనోపలీకి దారితీసే ప్రమాదం వుందని ఎగ్జిబిటర్లు అభిప్రాయపడ్డారు. 

కరోనా పరిస్థితులు చక్కబడి థియేటర్లు అన్నీ జూలై నెలాఖరుకు తెరచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని, అందువల్ల దూరం ఆలోచించి, అక్టోబర్ నెలాఖరు వరకు నిర్మాతలు తమ తమ సినిమాలను హోల్డ్ చేసి పెట్టాలని, ఒటిటికి ఇవ్వవద్దని కోరుతూ సమావేశంలో ఓ తీర్మానం చేసారు. అప్పటికీ పరిస్థితులు చక్కబడకపోతే ఓటిటికి ఇచ్చేసుకోవచ్చు అని ఈ లోగా మాత్రం ఇవ్వవద్దని కోరుతూ తీర్మానం చేసారు.

ఒకవేళ అలా ఎవరైనా అక్టోబర్ లోగా ఒటిటి కి సినిమాలు ఇస్తే, ఏ విధమైన కార్యాచరణకు దిగాలన్నది, ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోవాలన్నది త్వరలో నిర్ణయిస్తామన్నారు.