ఓజి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా. ఒకటి రెండురోజుల్లో సెట్ మీదకు వెళ్లబోతోంది. ఈ సినిమాకు పవన్ కేవలం 30 రోజలు వర్క్ చేస్తే చాలు అని మొదట్లో వినిపించింది. సినిమా విశ్రాంతి ముందు మాత్రమే హీరో ఎంట్రీ వుంటుందని, అంతవరకు థ్రిల్లింగ్ మూవ్ మెంట్స్ సాగుతుందని వినిపించింది.
అయితే వినోదయసితం లో కూడా పవన్ పాత్ర పెద్దది కాదు. ఇప్పుడు ఓజి లో కూడా అలాగే అయితే ఫ్యాన్స్ బాగా డల్ అయిపోతారనే అభిప్రాయాలు బలంగా పవన్ కళ్యాణ్ వరకు చేరినట్లు తెలుస్తోంది.
ఫుల్ లెంగ్త్ సినిమాలు అయిన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ లు ఈ ఏడాది ఎలాగూ రావు. మిగిలినది వినోదయసితం రీమేక్, ఓజి సినిమాలే. అందుకే ఈ రెండింటిలో ఒకటి ఫ్యాన్స్ కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో వుండాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఓజి కోసం పవన్ డేట్స్ పెరుగుతున్నాయి.
సుమారు 50 వర్కింగ్ డేస్ పవన్ ఈ సినిమా కోసం కేటాయించాల్సి వస్తోంది. అదే ఉస్తాద్ భగత్ సింగ్ కు అయితే దాదాపు 90 రోజులు కేటాయించాల్సింది.
ఓజి సినిమాలో మరి హీరోయిన్ క్యారెక్టర్ లెంగ్త్ కూడా పెరుగుతుందా? లేదా? అన్నది తెలియాల్సి వుంది. హీరోయిన్ ప్రియా అరుళ్ మోహన్ ను తీసుకుంటున్నారు. ఈసినిమాకు నిర్మాత డివివి దానయ్య. దర్శకుడు సుజిత్.