ఓజి విడుదల ఏప్రిల్ 2024?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఓజి. దర్శకుడు సుజిత్. నిర్మాత దానయ్య. ఈ డిఫరెంట్ సినిమా మీద ఫ్యాన్స్ కు చాలా ఆశలు వున్నాయి.  Advertisement ఈ సినిమా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్న సినిమా ఓజి. దర్శకుడు సుజిత్. నిర్మాత దానయ్య. ఈ డిఫరెంట్ సినిమా మీద ఫ్యాన్స్ కు చాలా ఆశలు వున్నాయి. 

ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కు విడుదల అవుతుందని ఓ టాక్ వుంది. ఫ్యాన్స్ కూడా అదే హోప్ తో వున్నారు. బ్రో సినిమా వారి ఆకలి తీర్చలేదు. ఉస్తాద్ సినిమా సంక్రాంతికి అంటున్నారు కానీ అది షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. రెండు మూడు రోజుల చిన్న షెడ్యూలు మాత్రం చేసి ఆగింది. ఇలాంటి నేపథ్యంలో ఓజి మీదే ఆశలు అన్నీ.

కానీ ఇప్పుడు టాలీవుడ్ లో విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే ఓజి సినిమా విడుదల ఏప్రిల్ 2024 లో వుంటుందన్నది. సినిమా వర్క్, దాంతో పాటు సిజి వర్క్ కాస్త ఎక్కువే వుంటుందని తెలుస్తోంది. అందువల్ల డిసెంబర్ లో రావడం కష్టం అవుతుందని, ప్రీ సమ్మర్ లేదా సమ్మర్ లో విడుదల వుండొచ్చని తెలుస్తోంది. నిర్మాత దానయ్య కూడా ఒకరిద్దరితో ఏప్రిల్ లో విడుదల వుంటుందని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల వుంటుందని వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ నే బ్రో విడుదల తరువాత నిర్మాతలకు ఈ మేరకు క్లారిటీ ఇచ్చారని, షెడ్యూలు రెడీ చేయమన్నారని ఆ వార్తల సారాంశం. అంటే ఈ లెక్కన ఎన్నికల ముందు రెండు సరైన సినిమాలు వుండేలా పవన్ ప్లాన్ చేసుకుంటున్నారనుకోవాలి.