ఒకటే కథ…రెండు సినిమాలు

తెలుగు సినిమా జనాలు ఎక్కడో ఏదో సినిమా చూస్తారు. ఏదో పాయింట్ చూసి ఇన్ స్పయిర్ అవుతారు. ఎవరి స్టయిల్ లో వారు కథ అల్లేసుకుంటారు. ఒక్కోసారి ఇలా ఒకే పాయింట్ తో చాలా…

తెలుగు సినిమా జనాలు ఎక్కడో ఏదో సినిమా చూస్తారు. ఏదో పాయింట్ చూసి ఇన్ స్పయిర్ అవుతారు. ఎవరి స్టయిల్ లో వారు కథ అల్లేసుకుంటారు. ఒక్కోసారి ఇలా ఒకే పాయింట్ తో చాలా సినిమాలు వచ్చేస్తుంటాయి. ఇక్కడ సృజన అందరి సొంతం కాదు. కానీ ఇన్ స్పిరేషన్ అన్నది చాలా మంది స్వంతం.

టాలీవుడ్ లో విడుదలకు సిద్దం అవుతున్న రెండు సినిమాలకు కోర్ పాయింట్ ఒకటే అని టాక్ వినిపిస్తోంది. ఏనాడో ప్రారంభమైన నాగశౌర్య 'కృష్ణ విృంద విహారి' సినిమాకు అనీష్ కష్ణ దర్శకుడు. రెండు కరోనాలు చూసి, విడుదలకు సిద్దమైంది ఈ సినిమా. ఇది నాగశౌర్య హోమ్ బ్యానర్ మీద వస్తున్న సినిమా. మైత్రీ మూవీస్ నాని సినిమా 'అంటే సుందరానికి..'. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకుడు. ఈ సినిమా కూడా విడుదలకు రెడీ అవుతోంది.

విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాల్లో కోర్ పాయింట్ ఒకటే అని వినిపిస్తోంది. రెండింటిలోనూ హీరో బ్రాహ్మిన్ కుర్రాడే. రెండింటిలోనూ ఆ బ్యాక్ గ్రవుండ్ కీలంగా వుంటుంది. అలాగే పిల్లల సమస్య అన్నది కూడా పాయింట్ గా వుంటుందని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగశౌర్య సినిమాతో నాని సినిమాకు 60శాతం పోలికలు వుంటాయని తెలుస్తోంది. అయితే అది నాని స్టయిల్ ఫన్ సినిమా. ఇది శౌర్య స్టయిల్ ఫన్ సినిమా. ఇంతకీ ఈ ఇద్దరు దర్శకులకు ఇన్ స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చినట్లో?