జాతిరత్నాలు సినిమా తరువాత మళ్లీ అలా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ముగ్గురు హీరోల ఎంటర్ టైన్ మెంట్ కథతో వస్తున్న సినిమా ఓం.. భీమ్.. బుష్. ఈ సినిమా టీజర్ బయటకు వచ్చి, ఈ సినిమాలో మరింత క్లారిటీ ఇచ్చింది. లాజిక్ లు లేని లాఫింగ్ మ్యాజిక్ ఈ సినిమా అని చూపించింది. వినిపించింది.
టీజర్ కట్ లోనే దర్శకుడి వెటకారం అంతా కనిపించేసింది. ముగ్గురు కుర్రాళ్లు సైంటిస్ట్ లము అని చెప్పి, చిత్రమైన గెటప్ ల్లో భైరవపురం అనే ఊరికి రావడం, అక్కడ వాళ్లు చేసే అల్లరి, చివరకు ఎక్కడకు చేరింది అనేది సినిమా అని ట్రయిలర్ లో చెప్పేసాడు దర్శకుడు హర్ష కొనుగంటి. గతంలో హుషారు అనే సినిమా అందించాడు ఇతగాడు.
ముగ్గురు హీరోలుగా శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కనిపించారు. వాళ్ల అల్లరి పంచ్ లు మామూలుగా లేవు. కథ, కాకరకాయ అనవసరం..ఫన్ పుట్టించడానికి కొన్ని సీన్లు..ఆ సీన్లలో పేలే పంచ్ డైలాగులు..ఇదే ఫార్ములాగా వెళ్లినట్లు కనిపిస్తోంది. కామెడీ సినిమాల కోసం మొహంవాచి వున్నారు జనం. జబర్దస్త్ పంచ్ లే విని నవ్వుకోవాల్సి వస్తోంది. అందువల్ల అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటే థియేటర్లు నవ్వులతో దద్దరిల్లుతాయి.
యువి సంస్థ ఇలాంటి లైటర్ కామెడీ సినిమాను అందిస్తోంది. అందువల్ల నిర్మాణ విలువలు, మంచి రిలీజ్ గ్యారంటీ గా వుంటుంది. ఆ డేట్ కోసం వెయింటింగ్.