Advertisement

Advertisement


Home > Movies - Movie News

టాలీవుడ్ పై ఒమిక్రాన్ ప్రభావం ఎంత?

టాలీవుడ్ పై ఒమిక్రాన్ ప్రభావం ఎంత?

ఉన్నట్టుండి విరుచుకుపడింది ఒమిక్రాన్. దీంతో ప్రపంచదేశాలన్నీ మరోసారి అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆంక్షలు విధించాయి. అయితే ఈలోగానే ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి ఇండియాకు, మరీ ముఖ్యంగా హైదరాబాద్ కు ప్రయాణికులు వచ్చారు. ప్రస్తుతానికైతే ఎలాంటి కేసులు బయటపడలేదు కానీ, ఈ ప్రభావం మాత్రం టాలీవుడ్ పై మరోసారి గట్టిగా పడుతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.

సాధారణ కరోనా వైరస్ తో పోలిస్తో ఒమిక్రాన్ 6 రెట్లు వేగంగా విస్తరిస్తుందని ఇప్పటికే ఫలితాల్లో తేలింది. లక్షణాలు స్వల్పంగా ఉన్నప్పటికీ ప్రాణాంతకం అనే విషయాన్ని వైద్య నిపుణులు తేల్చేశారు. ఒమిక్రాన్ భయాందోళనలు సాధారణ ప్రజల్లో కూడా మొదలయ్యాయి. ఇక ఈ తరహా కేసులు వెలుగుచూశాయని తెలితే మాత్రం జనాలు థియేటర్లకు రావడం కష్టమే.

ఇప్పటికే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రాక ఏడాది దాటింది. ఇలాంటి టైమ్ లో ఒమిక్రాన్ విజృంభిస్తే యూత్ కూడా థియేటర్లకు రారు. భౌతిక దూరం, శానిటైజర్ల వాడకం వంటి నిబంధనల్ని మరోసారి అమల్లోకి తీసుకొచ్చినప్పటికీ.. థియేట్రికల్ బిజినెస్ పై ప్రభావం మాత్రం తప్పనిసరి.

టాలీవుడ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. అంతా సెట్ అయిందని భావించిన బడా నిర్మాతలు డిసెంబర్ నుంచి పెద్ద సినిమాల రిలీజులు పెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు సంక్రాంతికి సిద్ధమయ్యాయి. ఈ టైమ్ లో మరోసారి కరోనా కేసులు పెరిగితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ వాయిదా అంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో.. థియేట్రికల్ బిజినెస్ ఎలా ఉండబోతోందనే విషయం అఖండ నుంచి దశలవారీగా తేలిపోతుంది. అఖండ విడుదలకు ఇంకా 2 రోజులు టైమ్ ఉంది. కేసులు పెరిగితే అఖండ వసూళ్లపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పుష్ప విడుదలే ప్రశ్నార్థకంగా మారుతుంది. థర్డ్ వేవ్ మొదలైతే సంక్రాంతి సినిమాలన్నీ మూకుమ్మడిగా వాయిదా పడడం ఖాయం. పరిస్థితి అంతవరకు రాకూడదని కోరుకుందాం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?