Advertisement

Advertisement


Home > Movies - Movie News

వెంకటేష్ హీరోగా రాజుగారి గది సిరీస్

వెంకటేష్ హీరోగా రాజుగారి గది సిరీస్

రాజుగారి గది టైటిల్ మీద ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక సినిమాలో నాగార్జున కూడా నటించాడు. అయితే ఎప్పటికైనా వెంకటేష్ తో రాజుగారి గది సిరీస్ చేస్తానంటున్నాడు దర్శకనిర్మాత ఓంకార్. అంతేకాదు.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికే వెంకటేష్ తో సినిమా సెట్ అయ్యేదని, జస్ట్ మిస్ అయిందని అంటున్నాడు.

"నిజానికి రాజుగారి గది సినిమా తర్వాత రాజుగారి గది 2 సినిమాను వెంకటేష్ తోనే ప్లాన్ చేశాను. కానీ కొన్ని కారణాల వల్ల నాగార్జునతో చేయాల్సి వచ్చింది. వెంకటేష్ తో కచ్చితంగా రాజుగారి గది సిరీస్ చేస్తాను. కాకపోతే అది ఎప్పుడనేది అప్పుడే చెప్పలేను. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజుగారి గది 4లోనే వెంకటేష్ ఉండొచ్చు."

ఇలా రాజుగారి గది సిరీస్ కు వెంకీకి మధ్య ఉన్న కనెక్షన్ ను బయటపెట్టాడు ఓంకార్. అంతేకాదు.. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన రాజుగారి గది 3 సినిమా స్ట్రయిట్ మూవీ కాదనే విషయాన్ని కూడా అంగీకరించాడు ఈ దర్శకుడు. ఓ తమిళ సినిమా నుంచి స్ఫూర్తి పొంది రాజుగారి గది 3 తీశానంటున్నాడు.

"రాజుగారి గది 3 సినిమాను తమిళ సినిమా దిల్లుకు దుడ్డు 2 ఆధారంగా తీసిన విషయం నిజమే. కాకపోతే ఆ సినిమా నుంచి కేవలం సోల్ మాత్రమే తీసుకున్నాం. చాలా సన్నివేశాలు మార్చేశాం. కామెడీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. మన నేటివిటీ కోసమే ఈ మార్పులు. తమిళ సినిమా చూసిన ప్రేక్షకులు, రాజుగారి గది 3 చూస్తే ఆ తేడాల్ని ఎక్కువగా తెలుసుకుంటారు."

తమన్న తప్పుకున్న తర్వాత రాజుగారి గది 3లో హీరోయిన్ వేషం కోసం కాజల్ ను సంప్రదించిన విషయాన్ని ఒప్పుకున్నాడు ఓంకార్. కాజల్ కూడా తమ సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదని, దీంతో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథను, కామెడీని పూర్తిగా మార్చేశామని అంటున్నాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది రాజుగారి గది 3.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?