Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'మంచివాడు' బిజినెస్ట్ స్టార్ట్

'మంచివాడు' బిజినెస్ట్ స్టార్ట్

సంక్రాంతి పండగకు రావాలని అనుకుని, పెద్ద సినిమాలో పోటీ పోటీ వ్యవహారంతో వారం వెనక్కు జరిగిన సినిమా 'ఎంత మంచి వాడవురా'. కళ్యాణ్ రామ్- సతీష్ వేగ్నిశ కాంబినేషన్ లో తయారవుతున్న ఈ సినిమా టీజర్ ఆ మధ్య వచ్చింది. దీంతో సినిమా బిజినెస్ కు ఊపు వచ్చింది. ఆంధ్రలో ఏడు కోట్ల నుంచి 8 కోట్ల రేషియోలో మార్కెట్ స్టార్ట్ చేసారు. ఉత్తరాంధ్రను 1.62 కోట్లకు గాయత్రీ ఫిలింస్ సతీష్ క్లోజ్ చేసారు.

మెహరీన్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో ఈ సినిమాకు ఆంధ్రలో ఈ రేంజ్ లో బిజినెస్ ఓపెన్ కావడం కాస్త చెప్పుకోదగ్గ విషయమే. కళ్యాణ్ రామ్ రేంజ్ హీరోల సినిమాలు అయిదు, ఆరు మించి మార్కెట్ చేయడం లేదు. అలాంటి టైమ్ లో ఎనిమిది కోట్లు అంటే నిర్మాతకు మంచి రేటు వచ్చినట్లే అనుకోవాలి.

ఇటీవల ఉత్తరాంధ్ర మార్కెట్ బాగా పెరిగింది. సైరా లాంటి సినిమా 14 కోట్లు దాటి వసూళ్లు సాధించింది. దాంతో రెగ్యులర్ లెక్కలు పక్కనపెట్టి మరీ ఉత్తరాంధ్రకు రేట్లు పలుకుతున్నాయి. అల వైకుంఠపురములో మిగిలిన ఏరియాలు 38 రేంజ్ లో చెబుతుంటే, వైజాగ్ ఏరియా మాత్రం 40 రేంజ్ లో తీసుకోవడానికి బయ్యర్లు రెడీగా వుండడం పెరుగుతున్న ఉత్తరాంధ్ర మార్కెట్ కు సూచన అనుకోవాలి.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?