అప్పుడు కాదు.. ఇప్పుడు జగన్ దేవుడు

జగన్ కి 151 సీట్ల భారీ మెజార్టీయే రావొచ్చు, టీడీపీ 23 సీట్లకే పరిమితం కావొచ్చు. కానీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ సానుభూతిపరులు, కొన్ని వర్గాల వారు జగన్ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారు.…

జగన్ కి 151 సీట్ల భారీ మెజార్టీయే రావొచ్చు, టీడీపీ 23 సీట్లకే పరిమితం కావొచ్చు. కానీ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ సానుభూతిపరులు, కొన్ని వర్గాల వారు జగన్ ముఖ్యమంత్రి కాకూడదని కోరుకున్నారు. టీడీపీకి, చంద్రబాబుకి అధికారం దూరమైతే తమ పరిస్థితి ఏంటి అని బాధపడ్డారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఊరిలోనూ టీడీపీ అనుకూల వర్గం తమకు తామే గిరిగీసుకుని బతుకుతోంది. అలాంటి వారందరికీ ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతోంది.

రైతు భరోసా ప్రకటించిన తర్వాత పార్టీలకతీతంగా రైతులందరికీ ఆర్థికసాయం అందుతుంటే టీడీపీ అనుకూల వర్గం జనాలు కూడా జగన్ ని దేవుడిలా చూస్తున్నారు. గ్రామ సభల్లో ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో రాజకీయాలేవీ లేకపోవడం, టీడీపీవారు కూడా అర్హుల జాబితాలో ఉండటంతో.. వారిలో పశ్చాత్తాపం మొదలైంది. టీడీపీ హయాంలో లబ్ధిదారులు అంటే కచ్చితంగా ఆ పార్టీ సానుభూతి పరులే. పథకం ఏదైనా, కాంట్రాక్ట్ ఎలాంటిదైనా ఆ పార్టీ మనుషులకే. ఐదేళ్ల పాటు అలాగే పచ్చపాలన సాగించారు చంద్రబాబు.

ఇదంతా చూసిన టీడీపీ సానుభూతి పరులు, జగన్ వస్తే తమకు అన్యాయం చేస్తారని బాధపడ్డారు. కానీ జగన్ పాలన నిజాయితీగా, న్యాయబద్ధంగా సాగుతుండే సరికి జగన్ ని శత్రువుగా చూసినవారే ఇప్పుడు తమ దేవుడిలా కొలుస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో రైతులకు పార్టీలతో సంబంధం లేకుండా రైతు భరోసా సొమ్ము అకౌంట్లలో డిపాజిట్ అయింది. వైసీపీ వర్గం ఒకింత కోపంతో ఉన్నా ఇది జగన్ మార్కు పాలన అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నాలుగున్నర నెలల్లోనే అందరి మనసులు గెలుచుకున్న జగన్.. నాలుగున్నరేళ్ల పాలనలో దాదాపుగా తనకి వ్యతిరేక వర్గమే లేకుండా చేసుకుంటారనడంలో సందేహమే లేదు. సీఎం జగన్ అనుకున్నట్టే అన్ని పథకాలు అమలైతే.. వచ్చే ఎన్నికల్లో జగన్ కి ఇక తిరుగే ఉండదు. టీడీపీ సింగిల్ డిజిట్ కి పడిపోయినా ఆశ్చర్యం లేదు. 

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్