సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ తో భవిష్యత్తును ఊహిస్తూ రాసుకున్న కథతో వస్తోంది ప్రాజెక్ట్-కె. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. హాలీవుడ్ సినిమాల తరహాలో ఓవైపు షూటింగ్ నడుస్తుండగానే, మరోవైపు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మేకర్స్.
ఇందులో భాగంగా 'ఫ్రమ్ ది స్క్రాచ్' కాన్సెప్ట్ తో ప్రీ-ప్రొడక్షన్ వీడియోస్ ను విడుదల చేస్తున్నారు. ఎపిసోడ్-1లో భాగంగా ఓ వీల్ తయారుచేసే విధానం చూపించారు. ఇప్పుడు ఎపిసోడ్-2లో సినిమాలో ఓ సెక్షన్ నటీనటులకు వేసే దుస్తుల రూపకల్పనకు చెందిన వీడియోను విడుదల చేశారు.
ఇప్పటివరకు విడుదలైన ఈ 2 వీడియోల్ని గమనిస్తే, ప్రాజెక్ట్-కె సినిమా కచ్చితంగా కొత్తగా ఉండబోతోందనే విషయం అర్థమౌతుంది. మేకింగ్, డిజైనింగ్, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్.. ఇలా అన్నింటిలో ఈ సినిమా కొత్తగా కనిపించబోతోంది.
వైజయంత్రీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకోన్ హీరోయిన్ గా నటిస్తోంది. హీరోహీరోయిన్లకు కూడా డిఫరెంట్ గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన విషయం ప్రీ-లుక్స్ తో అర్థమౌతుంది.
అంతా ఓకే.. ఇది మాత్రం నాట్ ఓకే..
ఇలా ప్రాజెక్ట్-కె కు సంబంధించి విడుదల చేసిన ప్రతి అంశాన్ని ప్రేక్షకులు ఎఁజాయ్ చేస్తున్నారు, ఫ్యాన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు. అయితే ఒక్క విషయాన్ని మాత్రం అంగీకరించడం లేదు. సంక్రాంతికి ఈ సినిమా వస్తుందనే విషయాన్ని మాత్రం సోషల్ మీడియాలో చాలామంది అంగీకరించడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో సంక్రాంతికి ప్రాజెక్ట్-కె రాదని, దయచేసి సంక్రాంతి రిలీజ్ అంటూ మరోసారి ప్రకటించొద్దని చెబుతున్నారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా ఈ ప్రస్తావన లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.