ఒరేయ్ బుజ్జిగా – మొబైల్ పబ్లిసిటీ

ఏదో ఒకటి కొత్తగా చేస్తే తప్ప, జనాల దృష్టి పడదు. వస్తువు అమ్మకాలు అయినా, సినిమాలు అయినా మార్కెటింగ్ స్ట్రాటజీ తప్పదు. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో రాధామోహన్…

ఏదో ఒకటి కొత్తగా చేస్తే తప్ప, జనాల దృష్టి పడదు. వస్తువు అమ్మకాలు అయినా, సినిమాలు అయినా మార్కెటింగ్ స్ట్రాటజీ తప్పదు. రాజ్ తరుణ్ హీరోగా కొండా విజయ్ కుమార్ డైరక్షన్ లో రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా కోసం మైబైల్ వాహనాలతో పబ్లిసిటీ ప్లాన్ చేసారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లు కలిగిన వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలలో తిరుగుతాయన్నమాట. వీటిని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ – “ఒరేయ్ బుజ్జిగా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని. ఈ కొత్త పబ్లసిటీ కాన్సెప్ట్ కూడా బాగుంది. తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఎక్కువ జనసందోహం ఉంటుందో  అక్కడ వాహ‌నాల ద్వారా ఈ పబ్లిసిటి చేయాలనే ఐడియా వర్క్ అవుట్ అవుతుంది అని ఆయన అన్నారు. 

తమ్మడు రాజ్ తరుణ్ ని `ఉయ్యాలా జంపాల` నుండి ప్రజలందరూ బాగా ఆద‌రిస్తున్నారు. మాళవిక నాయర్ కి ఐదవ చిత్రం వీరితో పాటు టీమ్ అందరికి నా శుభాకాంక్షలు. ఈ సినిమా సక్సెస్ అయ్యి నిర్మాతకి మంచి డబ్బులు రావాలి. అలాగే భవిష్యత్ లో కూడా ఇంకా మంచి చిత్రాలు తీయాలని కోరుకుంటున్నాను” అన్నారు. 

ఈ వాహనాల లాంచింగ్ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్, నిర్మాత రాధామోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒరేయ్ బుజ్జిగా సినిమా ఈ నెల 25న విడుదలకు రెడీ అవుతోంది.

ఒక ప్రిన్సిపల్ కడుపులో గుండాగాడు పుట్టాడు

ఏది నిజం ?