మన తెలుగు సినిమా తొలిసారి ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటునాటు పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ వరించింది. ఏన్నో దశాబ్ధాల నుంచి జాతీయ అవార్డుల్లో వివక్షకు గురవుతూ వస్తున్న తెలుగు సినిమా.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తల ఎత్తుకుంది.
రిహానా లాంటి హాలీవుడ్ సింగర్స్ పాడిన పాటలు బరిలో ఉన్నా వాటన్నింటినీ తలదన్ని రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట సినీ అవార్డుల్లో అత్యున్నత ప్రతిష్టాత్మక ఆస్కార్ గెలుచుకుంది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడారు. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్, రామ్‌చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
వరల్డ్ వైడ్‌గా 81 పాటలు ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వగా.. చివరి జాబితాలో ఐదు పాటలు ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయ్యాయి. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది.