అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా జరుగుతున్న ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ గెలుచుకుంది.
మహిళ డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ మూవీని తెరకెక్కించారు. ఆస్కార్ వేడుకలో కార్తీకి ఈ అవార్డును సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం. ది ఎలిఫెంట్ విస్పరర్స్ షార్ట్ ఫిలిమ్ గతేడాది డిసెంబర్ లో రిలీజైంది.
ద ఎలిఫెంట్ విష్పరర్స్… డైరక్టర్ కార్తికీ గొన్సాల్వేస్ వయసు 37 సంవత్సరాలు. డాక్యురీమెంటరీ కోసం ఆమె ఐదేళ్లు కష్టపడ్డారు. తన బృందంతో కలిసి ఐదేళ్ల పాటు ఏనుగులతో జీవించారు. ఇదంతా కథ కాదు నిజ జీవితంలో బొమ్మ, బెల్లీలు చేసే పనిని ఐదేళ్ల పాటు అందంగా విజువలైజ్ చేశారు. 40 నిమిషాల డాక్యుమెంటరీలో ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్వెన్ ఫాల్కనర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. చాలా సీన్లలో హార్ట్ మెల్ట్ అయిపోతుంది.