Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఓటిటి పై యుద్దానికి సిద్దం

ఓటిటి పై యుద్దానికి సిద్దం

ఓటీటీ పై టాలీవుడ్ ఎగ్ఙిబిటర్లు యుద్దానికి సిద్దం అవుతున్నారు. వీరితో నిర్మాతలు కూడా చేతులు కలపబోతున్నారు. ఓటిటికి నేరుగా సినిమా లు ఇవ్వడం కాదు ఇప్పుడు సమస్య. విడుదలయిన కొద్ది వారాల్లోనే సినిమాలను ఓటిటిల్లో ప్రదర్ళించడం వల్ల థియేటర్లకు దెబ్బ తగులుతోంది. 

రాను రాను సింగిల్ స్క్రీన్ లు మాయం అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అందుకే ఎగ్ఙిబిటర్లు, నిర్మాతలు కలిసి సినిమాలను ఓటిటి కి ఇవ్వడంపై అంక్షలు విధించాలని డిసైడ్ అయ్యారు.

ఈ మేరకు మరో రెండు మూడు రోఙుల్లో ఓ సమావేశం నిర్వహించబోతున్నారు. చిన్న సినిమాలు నెల తరువాత. పెద్ద సినిమాలు నెలన్నర తరువాత మాత్రమే ఓటిటిల్లో ప్రదర్శించాలని, అలా కాకుండా చేస్తే తరువాత అదే సంస్థ నిర్మించే సినిమాలను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలని డిస్కస్ చేస్తారు. నిర్ణయం కూడా తీసుకునే అవకాశం వుంది.

ఇప్పటికే ఓటిటి ల కారణంగా సినిమా థియేటర్లకు కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. సకాలంలో నిర్ణయం తీసుకోకపోతే థియేటర్ల భవిష్యత్ అయోమయంలో పడుతుందని ఎగ్ఙిబిటర్లు భయపడుతున్నారు. అందుకే అర్ఙెంట్ గా ఓ సమావేశం నిర్వహించబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?