తెలుగులో చకచకా సినిమాలు నిర్మిస్తున్న బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
హారిక హాసిని సంస్థకు అనుబంధమైన ఈ సంస్థ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్ట్రేలియా హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆరున్నర కోట్లతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు సితార సంస్థ సినిమా నిర్మాణాలే చేస్తోంది. లోకల్ గా డిస్ట్రిబ్యూషన్లతో సంబంధాలు వున్నా, అఫీషియల్ గా బిజినెస్ చేయడం లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో అఫీషియల్ అవుతోంది.
అయితే ఓ చిన్న ఆబ్లిగేషన్ తో తమ పేరిట ఒప్పందం చేసుకున్నాము తప్ప, తాము ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ లోకి రాలేదని సితార సంస్థ అధినేత నాగవంశీ అంటున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ హోల్ సేల్ డిస్ట్రిబ్యూటర్ వర్గాలు మాత్రం ఆస్ట్రేలియా రైట్స్ నాగవంశీ కే అమ్మినట్లు వెల్లడిస్తున్నాయి.