ఎక్స్ క్లూజివ్: సోడా సెంటర్ లో ‘పలాస’ టచ్

పలాస సినిమాలో ప్రతీకారమే కాన్సెప్ట్. చక్కగా పాటలు పాడుకునే వ్యక్తి, ప్రతీకారంతో రగిలిపోతాడు. చివరికి తన పగను చల్లార్చుకుంటాడు. దీన్నే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రఫ్ అండ్ నేచురల్ గా చూపించారు. దాదాపు…

పలాస సినిమాలో ప్రతీకారమే కాన్సెప్ట్. చక్కగా పాటలు పాడుకునే వ్యక్తి, ప్రతీకారంతో రగిలిపోతాడు. చివరికి తన పగను చల్లార్చుకుంటాడు. దీన్నే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో రఫ్ అండ్ నేచురల్ గా చూపించారు. దాదాపు ఇదే కాన్సెప్ట్ శ్రీదేవి సోడా సెంటర్ లో కూడా ఉంది. ఇందులో కూడా హీరో ప్రతీకారం తీర్చుకునే పాత్రలోనే కనిపించబోతున్నాడు.

కాకపోతే పలాస సినిమాకు, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు కథలో, స్క్రీన్ ప్లేలో, నేపథ్యంలో చాలా తేడాలున్నాయి. అయితే ఆత్మ మాత్రం ఒకటే. పలాసలో గజ్డె కట్టడాలు, జానపదాలు చూపిస్తే.. సోడా సెంటర్ లో పడవ పందాలు, మధ్యతరగతి పట్నం వాసనలు చూపించారు.

పోస్టర్ లో పైకి సుధీర్ బాబు కనిపిస్తున్నప్పటికీ.. నిజానికి ఈ సినిమా కథ మొత్తం హీరోయిన్ చుట్టూ తిరుగుతుందట. హీరోకు హీరోయిన్ దక్కదు అనే యాంగిల్ లో కథ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మాత్రం సోడా సెంటర్ కు పలాసకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు సినిమాలకు దర్శకుడు ఒకడే అనే విషయం తెలిసిందే.

ఈ సంగతులన్నీ పక్కనపెడితే.. హీరో సుధీర్ బాబుకు మాత్రం ఇది కచ్చితంగా కొత్త సినిమా. 'వి' సినిమాలో సిక్స్ ప్యాక్ లో, సమ్మోహనం సినిమాలో పక్కింటి కుర్రాడి లుక్స్ లో సుధీర్ బాబును చూసిన ఆడియన్స్.. శ్రీదేవి సోడా సెంటర్ లో అతడ్ని పూర్తి భిన్నంగా చూడబోతున్నారు. ఇది మాత్రం గ్యారెంటీ.