అమెరికన్-కెనడా మూలాలున్న హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ తన విడాకుల వ్యవహారంతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవలే ఈమె పెళ్లి చేసుకుంది. అయితే వెంటనే విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యిందట. దీనికి ఈమె తాజామాజీ భర్త కూడా ఓకే చెప్పారట. కేవలం పెళ్లైన 12 రోజుల్లోనే వీరు విడిపోతూ ఉండటం గమనార్హం. వీరి పెళ్లి అయ్యాకా… ఇంకా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇంకా ఇంటికి చేరలేదట. అయినా ఇంతలోనే ఈ జంట విడిపోతూ ఉంది.
52 యేళ్ల వయసున్న పమేలా..72 యేళ్ల వయసున్న జాన్ పీటర్స్ అనే వ్యక్తిని దాదాపు రెండు వారాల కిందట పెళ్లాడింది. ఇంతలోనే వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అని ప్రకటించారట. మరీ 12 రోజుల్లోనే వీరు ఒకరికి ఒకరు మొహం మొత్తేయడం గమనార్హం. పెళ్లి సర్టిఫికెట్ ఇంకా పోస్టులో ఇంటికి చేరక ముందే వీరు విడిపోవాలని డైవోర్స్ పిటిషన్ వేయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యకరంగా మారింది.
వీరి ప్రేమ కథ కూడా ఇప్పటిదేమీ కాదట. ముప్పై యేళ్ల నుంచి వీరు ఒకరికిఒకరు తెలుసట. ముప్పై యేళ్ల కిందట కొన్నాళ్ల పాటు వీరు డేటింగ్ చేశారట. ఆ తర్వాత వేరుపడ్డారు. పమేలాకు ఇప్పటి వరకూ నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి ముగ్గురో డివోర్స్ కాగా, ఇతడు నాలుగో వాడు. అయితే ఈమె తన మూడో భర్తను రెండు సార్లు పెళ్లాడింది. మూడో పెళ్లి అయ్యాకా కొంత కాలానికి అతడికి దూరం అయ్యింది. ఆ తర్వాత మళ్లీ అతడినే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ విడాకులు తీసుకున్నారు. ఇలా నాలుగు పెళ్లిళ్లు, మూడు విడాకుల ఈ ఒకనాటి సెక్సీ సైరన్.. నాలుగో సారి విడాకులకు రెడీ అయినట్టుగా ఉంది!