cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

పాపం,,నాగ్ అశ్విన్

పాపం,,నాగ్ అశ్విన్

టాలీవుడ్ లో టాప్ త్రీలో వుండాల్సిన, వుండి తీరాల్చిన దర్శకుడు నాగ్ అశ్విన్. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. కానీ అతగాడు పుష్కరానికో సినిమా అన్నట్లుగా, ప్రశాంతంగా, శిల్పం చెక్కినట్లుగా సినిమాలు తీస్తాడు.

ఇప్పటికి చేసినవి రెండే సినిమాలు. ముచ్చటగా మూడో సినిమాగా ప్రభాస్ తో వందల కోట్ల బడ్జెట్ తో తలకెత్తుకున్నాడు. కానీ ఇప్పుడు వ్యవహారం చూస్తుంటే ఆ సినిమా ఎప్పుడు రెడీఅవుతుంది ఎప్పుడు విడుదలవుతుందీ అన్నది అనుమానంగా వుంది.

ఎందుకుంటే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్వామ్ సినిమా చేస్తున్నారు. అది 2021 సమ్మర్ కు వచ్చే అవకాశం వుంది. 2022 కు దసరా టైమ్ కు ప్రభాస్ ఆదిపురుష్ విడుదల అంటూతాజాగా ప్రకటించేసారు. ఈ లోగా నాగ్ అశ్విన్ సినిమా విడుదల వుంటే అవకాశం లేదు.

ఎందుకంటే 2021 సమ్మర్ నుంచి 2022 సంక్రాంతి వరకు బోలెడు పెద్ద సినిమాలు లైన్ లో వున్నాయి. 2022 సంక్రాంతి స్లాట్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ఫిక్స్ చేసుకున్నారు. ఆ టైమ్ కు మహేష్ సినిమా కూడా వుండోచ్చు. మరేదైనా వుండొచ్చు. 

పైగా 2021 లో రాథేశ్వామ్, ఆదిపురుష్ పూర్తి చేయడానికే సరిపోతుంది. అందువల్ల 2022 లో నాగ్ అశ్విన్ సినిమాను ఆశించడానికి లేదు. ఇక మిగిలింది 2023. అంటే ఇప్పటికి మరో మూడేళ్ల దాకా నాగ్ అశ్విన్ సినిమాను మనం థియేటర్లో చూడలేకపోవచ్చు. అప్పటికి రాజెవరో? రెడ్డి ఎవరో? అన్నట్లు వుంటుంది వ్యవహారం.

నిమ్మ‌గ‌డ్డ అఖ‌రి ఆశ...ఇక గ‌వ‌ర్న‌ర్ పైనే భారం

 


×