ఎనిమిది భాషల్లో ‘పారడైజ్’

వింటేజ్ సికింద్రాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా..అండ్ రస్టిక్ సినిమా ఇది. దీని కోసం ఓల్డ్ సికింద్రాబాద్‌ సెట్ కూడా రెడీ అవుతోంది.

నాని- సుధాకర్ చెరుకూరి- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ సినిమా పారడైజ్. ఈ సినిమా గ్లింప్స్ ఇదిగో అదిగో అని ఊరిస్తోంది. నాని బర్త్ డే కు వస్తుందేమో అనుకున్నారు కానీ రాలేదు. ఇప్పుడు మొత్తం మీద ఓ డేట్ అంటూ ఫిక్స్ చేసారు. మార్చి 3న విడుదల చేయబోతున్నారు.

వింటేజ్ సికింద్రాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రా..అండ్ రస్టిక్ సినిమా ఇది. దీని కోసం ఓల్డ్ సికింద్రాబాద్‌ సెట్ కూడా రెడీ అవుతోంది. దసరా సినిమా కాంబినేషన్ కనుక దీని మీద నాని ఫ్యాన్స్‌లో, సినిమా లవర్స్‌లో చాలా ఆసక్తి వుంది.

గ్లింప్స్ గురించి ఇప్పటికే కథలు కథలుగా వార్తలు వచ్చాయి. అందువల్ల ఇది ఎలా వుంటుందో చూడాలి. శ్రీకాంత్ ఓదెల క్రియేటివిటీ, నాని జాగ్రత్తలు, సుధాకర్ చెరుకూరి ఖర్చు అన్నీ కలిసి గ్లింప్స్‌ను ఓ లెవెల్‌లో వచ్చేలా చేసాయనే టాక్ వుంది.

హిట్ 3 పనుల మీద వున్న హీరో నాని త్వరలో పారడైజ్ సినిమా మీదకు వస్తారు. దాంతో పాటే మరో సినిమా కూడా సమాంతరంగా చేసే ఆలోచనలో వున్నారు. 2025లో ఎలాగైనా రెండు సినిమాలు విడుదల చేయాలన్నది నాని ప్లాన్.

3 Replies to “ఎనిమిది భాషల్లో ‘పారడైజ్’”

Comments are closed.