మన్నత్ ను వీడనున్న షారూక్ ఖాన్

ప్రస్తుతం ఉన్న నివాసం ‘మన్నత్’ను మరింత డెవలప్ చేయడానికి చాన్నాళ్లుగా ప్రణాళికలు వేస్తున్నాడు షారూక్.

ముంబయిలోని ప్రముఖ టూరిస్టు స్పాట్స్ లో మన్నత్ కూడా ఒకటి. షారూక్ ఖాన్ నివాసం ఇది. ముంబయి పర్యటించేవాళ్లు చాలామంది షారూక్ నివాసాన్ని కూడా చూడాలనుకుంటారు. మన్నత్ బయట నిల్చొని సెల్ఫీలు తీసుకొని వెళ్తుంటారు. అలాంటి ఐకానిక్ బిల్డింగ్ ను షారూక్ వీడబోతున్నాడు.

ముంబయిలోని బాంద్రాను వీడి పాలీ హిల్ ప్రాంతానికి షిఫ్ట్ అవుతున్నాడు షారూక్. అక్కడ 2 లగ్జరీ డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్స్ ను అద్దెకు తీసుకున్నాడు. ఏడాదికి 2 కోట్ల 90 లక్షల రూపాయలు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంటే, నెలకు అటుఇటుగా 24 లక్షల రూపాయలు అద్దె అన్నమాట. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీకి చెందిన ప్రాపర్టీస్ ఇవి.

మరో 2 నెలల్లో అద్దెకు తీసుకున్న లగ్జరీ అపార్ట్ మెంట్స్ లోకి షారూక్ తన కుటుంబంతో పాటు మారబోతున్నాడు. అయితే ఇదంతా తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. షారూక్ ఇలా మారడానికి ఓ కారణం ఉంది.

ప్రస్తుతం ఉన్న నివాసం ‘మన్నత్’ను మరింత డెవలప్ చేయడానికి చాన్నాళ్లుగా ప్రణాళికలు వేస్తున్నాడు షారూక్. ప్రస్తుతం ఉన్న 6 అంతస్తులపైన మరో 2 అంతస్తులు నిర్మించడంతో పాటు.. దానికి అనుబంధంగా నిర్మాణ ప్రాంతాన్ని ఇంకో 616 చదరపు మీటర్లు విస్తరించాలనుకుంటున్నారు.

దీనికి సంబంధించి మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అధారిటీకి దరఖాస్తు కూడా చేసుకున్నారు. అథారిటీ నుంచి అనుమతి రావడంతో మే నెల నుంచి మన్నత్ ఆధునికీకరణ పనులు మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అందుకే మన్నత్ ను వీడి మరో ప్రాంతానికి వెళ్తున్నాడు షారూక్.

7 Replies to “మన్నత్ ను వీడనున్న షారూక్ ఖాన్”

  1. వక్ఫ్ బోర్డు వాళ్లు ప్రతి సారీ, కేవలం హిందూ గుళ్ళు కి చెందిన స్థలాలు తమవే అంటారు. ఒక్కసారి సరి కూడా ముస్లిం లో ధనవంతులు యొక్క స్థలాలు అల్లా కి చెందినవి అనడు, ఏమిటో ఆ సీక్రెట్.

Comments are closed.