అరెస్ట్‌ల‌పైనే చ‌ర్చ …కూట‌మి ఏం కోరుకుంటోంది?

కూట‌మి పాల‌న అంటే… రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని అరెస్ట్ చేయ‌డం మాత్ర‌మేనా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

కూట‌మి పాల‌న అంటే… రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల్ని అరెస్ట్ చేయ‌డం మాత్ర‌మేనా? అనే చ‌ర్చ‌కు తెర‌లేచింది. ఇటీవ‌ల కాలంలో వ‌రుస అరెస్ట్‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి. గ‌న్న‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీని ద‌ళిత యువ‌కుడి కిడ్నాప్ వ్య‌వ‌హారంలో అరెస్ట్ చేశారు. ఇవాళ్టితో మూడోరోజు విచార‌ణ పూర్తి కానుంది. దీంతో కోర్టు ఇచ్చిన పోలీస్ క‌స్ట‌డీ స‌మ‌యం ముగియ‌నుంది.

గ‌త రాత్రి సినీ ర‌చ‌యిత‌, వైసీపీ మాజీ నాయ‌కుడు పోసాని కృష్ణ‌ముర‌ళిని కూడా హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న్ను అన్న‌మ‌య్య జిల్లా ఎస్పీ విద్యాసాగ‌ర్‌నాయుడు విచార‌ణ జ‌రుపుతున్నారు. అరెస్ట్‌కు కార‌ణాలేవైనా, ఇత‌ర విష‌యాల‌న్నీ ప‌క్క‌క‌పోయాయి. కేవ‌లం అరెస్ట్‌ల గురించే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

కేసులు, అరెస్ట్‌లు, రిమాండ్‌లు, పోలీస్ కస్ట‌డీలు…ఇప్పుడు ఏపీలో ప్ర‌జానీకం ఎక్కువగా చ‌ర్చించుకునే అంశాల‌య్యాయి. వీటి వ‌ల్ల కూట‌మి స‌ర్కార్ ఏం ఆశిస్తున్న‌దో తెలియ‌దు కానీ, వ్య‌తిరేక‌త మాత్రం మూట‌క‌ట్టుకుంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. కూట‌మి ప్ర‌భుత్వ అరెస్ట్‌ల పుణ్య‌మా అని ప‌రిపాల‌న‌, ఇత‌ర పాల‌నాప‌ర‌మైన అంశాల‌న్నీ మ‌రుగున ప‌డ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రెడ్‌బుక్‌లో రాసుకున్న వాళ్లంద‌ర్నీ విడ‌త‌ల వారీగా అరెస్ట్ చేస్తూ పోతే, పాల‌నాకాలమంతా ఇదే స‌రిపోతుంది. ఐదేళ్లు కేసులు, అరెస్ట్‌ల‌పైనే చ‌ర్చ జ‌ర‌గ‌డం వ‌ల్ల, అంతోఇంతో చేసే మంచి ప‌నుల‌పై ప్ర‌జ‌లు మాట్లాడుకునే ప‌రిస్థితి వుండ‌ద‌ని నాలుగో ద‌ఫా సీఎంగా ప‌ని చేస్తున్న చంద్ర‌బాబు ఎందుకు గ్ర‌హించ‌డం లేదో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. మంత్రి అనాలోచిత విధానాలే ప్ర‌భుత్వ ప్రాధాన్యాలు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇలాంటి చ‌ర్య‌ల‌న్నీ అధికారంలో ఉన్నోళ్ల‌కు మాన‌సిక సంతృప్తి ఇవ్వొచ్చు. అయితే పాల‌న అంటే ఇదేనా? అని ఒక్క‌సారి త‌మ‌ను తాము ప్ర‌భుత్వ పెద్ద‌లు విశాల దృక్ప‌థంతో ప్ర‌శ్నించుకుంటే, స‌మాధానం వ‌స్తుంది. కానీ పాల‌కుల్లో సంకుచిత స్వభావం వ‌ల్ల విశాల ప్ర‌యోజ‌నాల ఆలోచ‌నే లేకుండా పోతున్న‌ది. దీనివ‌ల్ల ఎన్నిక‌ల్లో భారీ మూల్యం చెల్లించుకునే ప్ర‌మాదాన్ని కోరి తెచ్చుకుంటున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

21 Replies to “అరెస్ట్‌ల‌పైనే చ‌ర్చ …కూట‌మి ఏం కోరుకుంటోంది?”

  1. చంద్ర బాబు కంటే అందం గా, స్మార్ట్ గా ఉండటమే పోసాని కృష్ణమురళి పాలిట శాపం అయింది… అందుకే అరెస్టు అయ్యాడేమో???

  2. మనకి పనిలేదు అని ఆ.ప్ ప్రజానీకానికి ఇంకే పని లేదు అనుకుంటే ఎట్లా వెంకట్రావు .. ఎవడైనా రోడ్ల మీదకి వొచ్చి బందులు రాస్తారోకోలు చేసారా ?

      1. ఆ దద్దమ్మ గాన్ని మర్చిపో బయ్యా, వాడు వచ్చేది లేదు, పార్టీ బతికేది లేదు

    1. చేసింది మంచి అని నువ్వు అనుకుంటే సరిపోతుందా, రాళ్ళ మీద బొమ్మలు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేసుకోవటమే సరిపోయింది. నవరత్నాలు అని ముష్టి అవసరం లేదు అని ఛెప్పుతో కొట్టినట్టు కొట్టినా ఇంకా అర్థం కాకపోతే ఇక అంతే సంగతులు, పార్టీ మూసుకోవటమే

      1. Dabbu viluva adi avasaram unna vadike telusthundi ne jeebilo 100 unnappudu evadanna 10 eupailu musto la anipisthundi…ade 10 ra unnappudu evadanna 100 isthe devudi la kanipisthadu….pillalaki pusthakalu kondam schoolaki rangili veinchadam tappula kanipisthe emi chestham…vote hakku leni vadike manchi chedhamanukunna vadu unna vadini galiko Ela vadilesthadu… Eppudaina avasaram unna Vadiki oka 5 rs ichi chudu ninnu Ela chusthado telusthundi

  3. ముందర గ్రేట్ ఆంధ్ర యాజమాన్యానికి వంశి పోసాని బోరుగడ్డ ను ఇంకా ఇటువంటి వాళ్ళను శిక్షించటం కరెక్ట్ అనుకొంటుందా లేక అక్రమం అనుకొంటుందా నేరస్తులను రౌడీ లను శిక్షించక పొతే నష్టపోయేది సామాన్య ప్రజల దన మాన ప్రాణాలే కదా ఎవడో కలకత్తా లో ఒక అమ్మాయి ని రేప్ చేసి చంపేస్తే వురి శిక్ష వేయమని దెస మాన్తా కోరింది వీళ్ళు మాత్రం తక్కువ వాళ్ళ ప్రతిపక్ష పార్టీ వాళ్ళ స్త్రీల మీదకు వచ్చినవాళ్లు మీద థర్డ్ డిగ్రీ వాడాల్సిందే

Comments are closed.