ఓడిపోతామ‌ని ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు

గ్రాడ్యుయేట్ల మ‌ద్ద‌తు లేక‌పోవ‌డం వ‌ల్లే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌నే భ‌యంతో అధికార పార్టీ టీడీపీ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఉమ్మ‌డి గుంటూరు-కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పీడీఎఫ్ అభ్య‌ర్థి కేఎస్ లక్ష్మ‌ణ‌రావు ఆరోపించారు. ఏపీలో ఇవాళ రెండు గ్రాడ్యుయేట్లు, ఒక టీచ‌ర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్ష్మణ‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో ఎన్నిక‌లు ప్ర‌జాస్వామ్య‌యుతంగా జ‌ర‌గాల‌న్నారు.

ఇదే స‌హ‌జ న్యాయ‌సూత్ర‌మ‌న్నారు. కానీ అధికార పార్టీ అక్ర‌మాల‌కు తెగ‌బ‌డుతోందని ఆయ‌న విమ‌ర్శించారు. ముఖ్యంగా ప‌ల్నాడు ప్రాంతంలో దుర్గి, బెల్లంకొండ త‌దిత‌ర మండ‌లాల్లో త‌మ ఏజెంట్ల‌ను బ‌య‌టికి పంపి అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇదేం న్యాయం? అని ఆయ‌న నిల‌దీశారు. మీ చేత‌నైతే త‌ల‌ప‌డాల‌ని ల‌క్ష్మ‌ణ‌రావు స‌వాల్ విసిరారు.

తెనాలిలోని కోదండ శివ‌య్య హైస్కూల్‌లోని ఏడు బూత్‌ల‌లో భారీగా దొంగ ఓట్లు వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. మంగ‌ళ‌గిరిలో అధికార పార్టీ మాత్రం గేటు వ‌ర‌కూ ప్ర‌చారం చేసుకోడానికి అధికారిక యంత్రాంగం అనుమ‌తి ఇస్తోంద‌న్నారు. కానీ త‌మ‌ను మాత్రం అనుమ‌తించ‌డం లేద‌న్నారు.

ఈ విష‌య‌మై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. చేత‌నైతే గ్రాడ్యుయేట్ల మ‌ద్ద‌తు పొంది గెల‌వాల‌ని ఆయ‌న కోరారు. గ్రాడ్యుయేట్ల మ‌ద్ద‌తు లేక‌పోవ‌డం వ‌ల్లే అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

5 Replies to “ఓడిపోతామ‌ని ఎన్నిక‌ల్లో అక్ర‌మాలు”

  1. ఇన్ని రోజులు ఈవీఎంలు అన్నారు ఇపుడు బ్యాలెట్ తో కూడా జరిగిన అదే ఏడుపు.. 2024 లో రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గోరంగా ఒడిపోయింది, పోస్ట్ మార్టం చేసుక్కోకుండా సజ్జల మా ఓట్లు వేరే ఉన్నాయి అని సెలవిచ్చారు

Comments are closed.