రెండు నెలలు..రెండు హిట్ లు

ఈ రెండు నెలల్లో నిర్మాతలకు అయితేనే, బయ్యర్లకు అయితేనేం లాభాలు తెచ్చాయి అనిపించుకున్న సినిమాలు రెండే రెండు.

జనవరి, ఫిబ్రవరి..రెండు నెలలు. సుమారు 25 సినిమాలు విడుదలయ్యాయి తెలుగులో ఈ రెండు నెల్లలో. 25 సినిమా..పేర్లేంటీ అంటే కూడా గూగుల్ చేసుకుని కిందా మీదా పడితే తప్ప తెలియదు. కానీ ఈ రెండు నెలల్లో నిర్మాతలకు అయితేనే, బయ్యర్లకు అయితేనేం లాభాలు తెచ్చాయి అనిపించుకున్న సినిమాలు రెండే రెండు. ఒకటి జనవరిలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. రెండవది ఫిబ్రవరిలో వచ్చిన తండేల్.

పాతిక సినిమాల్లో పది నుంచి పదిహేను సినిమాలు కేవలం వాళ్ల సంతృప్తి కోసం తీస్తారు. ఎక్కడో ఒక చోట ఒకటి లేదా రెండు థియేటర్లలో విడుదల చేస్తారు. మిగిలిన పదికి పైగా సినిమాలు కాస్త పబ్లిసిటీ చేసుకునే వస్తాయి. ఓ రేంజ్ నుంచి ఓ మాదిరిగా వరకు పబ్లిసిటీ జరుగుతుంది, విడుదల కూడా అదే విధంగా వుంటుంది. కానీ ఫలితం మాత్రం అందడం లేదు.

ప్రామిసింగ్ సినిమాలుగా కనిపించినవి కూడా బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. కోటి నుంచి పాతిక కోట్లు తీసుకునే హీరోలు కూడా పట్టుమని పది టికెట్ లు తెంపలేకపోతున్నారు. కేవలం 100 పర్సంట్ కంటెంట్ వుంటే తప్ప టికెట్ లు తెగడం లేదు. అదే పెద్ద హీరోలు అయితే హాఫ్ కంటెంట్ వున్నా బండి లాగించగలుగుతున్నారు.

ఇలాంటి టైమ్ లో నిర్మాతలు ఇంకా హీరోలను నమ్మి, హీరోలకు కోట్లు రెమ్యూనిరేషన్లు ఇచ్చి సినిమాలు చేసి, భారీగా పబ్లిసిటీ చేసి, జనం రావడం లేదని దిగాలు పడుతున్నారు. గమ్మత్తేమిటంటే కంటెంట్ హాఫ్ బాగానే వుందని, మంచి సమీక్షలు వచ్చినా కూడా జనం రావడం లేదంటే హీరోలకు పుల్లింగ్ లేదని అనుకోవాలి తప్ప మరేమీ కారణం కనిపించదు.

9 Replies to “రెండు నెలలు..రెండు హిట్ లు”

Comments are closed.