హీరోయిన్ పెళ్లి.. సెల్ ఫోన్లకు ప్రత్యేక తొడుగులు

సినిమాలకే కాదు, తారల పెళ్లిళ్లకు కూడా లీకులుంటాయి. ఎంతోమంది తారలు తమ పెళ్లిళ్ల సమయంలో ఇలా లీకుల బారిన పడ్డారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ పెళ్లి వస్తోంది. ఆమె పేరు పరిణీతి చోప్రా. అయితే…

సినిమాలకే కాదు, తారల పెళ్లిళ్లకు కూడా లీకులుంటాయి. ఎంతోమంది తారలు తమ పెళ్లిళ్ల సమయంలో ఇలా లీకుల బారిన పడ్డారు. ఇప్పుడు మరో సెలబ్రిటీ పెళ్లి వస్తోంది. ఆమె పేరు పరిణీతి చోప్రా. అయితే ఈసారి లీకులు ఉండవంటున్నారు నిర్వహకులు.

మరో 2 రోజుల్లో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో అతిధుల్ని ఆహ్వానించింది ఈ జంట. అయితే వాళ్లు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెడితే పరిస్థితేంటి? అందుకే ఓ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టారు నిర్వహకులు.

పరిణీతి పెళ్లికి హాజరయ్యే ప్రతి ఒక్కరి మొబైల్ ను స్వాధీనం చేసుకొని భద్రపరచడం అసాధ్యం. దానికి ఎవ్వరూ అంగీకరించరు కూడా. అందుకే పెళ్లికొచ్చే అతిథుల మొబైల్ కెమెరాలు కవర్ అయ్యేలా నీలం రంగు టేపును అతికించబోతున్నారు. దీని వల్ల ఎవ్వరూ ఫొటోలు తీసుకోలేరు. మరి అతికించిన టేపు పీకేసి ఫొటోలు తీసుకోవచ్చు కదా..

ఈ సందేహం నిర్వహకులకు కూడా వచ్చింది. ఒకవేళ అతికించిన టేపును తొలిగిస్తే.. వెంటనే దానిపై ఓ బాణం గుర్తు ప్రత్యక్షమౌతుంది. ఈవెంట్ నుంచి బయటకెళ్లేముందు అందరి మొబైల్స్ చెక్ చేస్తారు. ఎవరి మొబైల్ పై బాణం గుర్తు ఉంటుందో, వాళ్లు ట్యాంపరింగ్ కు పాల్పడ్డారని అర్థం. అప్పుడు వాళ్ల మొబైల్ క్షుణ్నంగా పరిశీలించి, నిజంగా ఫొటోలుంటే వాటిని డిలీట్ చేసి బయటకు పంపిస్తారు.

ఈ ఏర్పాటు చెప్పుకోవడానికి బాగుంది కానీ, ఎంతమంది దీనికి అంగీకరిస్తారనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే, పెళ్లికి కరణ్ జోహార్, సానియా మీర్జా లాంటి టాప్ సెలబ్రిటీలు వస్తున్నారు. అటు రాజకీయాల నుంచి అరవింద్ కేజ్రీవాల్ లాంటి పొలిటీషిన్స్ వస్తున్నారు. టేప్ వేస్తామంటే వీళ్లు అంగీకరిస్తారా?

మరోవైపు పరిణీతి-రాఘవ్ పెళ్లికి ఉదయ్ పూర్ లోని లీల ప్యాలెస్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏకంగా వంద మంది ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటుచేశారు. రేపట్నుంచి వివాహ వేడుకలు మొదలవుతాయి. 24వ తేదీన పరిణీతి మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు రాఘవ్.