వివాహ బంధంలోకి మరో హీరోయిన్

హీరోయిన్ పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా, ఈమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఈరోజు ఉదయ్‌పూర్‌లో లీలా ప్యాలెస్ లో జరిగిన…

హీరోయిన్ పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దా, ఈమె మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇప్పుడు వీళ్లిద్దరూ భార్యాభర్తలు. ఈరోజు ఉదయ్‌పూర్‌లో లీలా ప్యాలెస్ లో జరిగిన వేడుకలో వీరిద్దరూ వీళ్ల పెళ్లి గ్రాండ్ గా జరిగింది.

డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన వివాహ దుస్తులను వధువు పరిణీతి చోప్రా ధరించింది. అటు రాఘవ్ కూడా డిజైనరీ దుస్తుల్లో మెరిశాడు. వేడుకకు సంబంధించి ఫొటోలు బయటకు రాకుండా, ఈ జంట కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఆహుతులు మొబైల్స్ కు బ్లూ కలర్ టేపులు వేసింది. అయినప్పటికీ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

2 రోజుల పాటు పరిణీతి-రాఘవ్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. చాలా కొద్దిమంది మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. మేవార్ సంప్రదాయ పద్ధతిలో వీళ్ల పెళ్లి జరిగింది. పెళ్లికి ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సానియా మీర్జా, హర్భజన్ సింగ్ లాంటి సెలబ్రిటీలు కూడా వచ్చారు. పరిణీతి చోప్రా అక్క ప్రియాంక చోప్రా మాత్రం ఈ వివాహ వేడుకకు హాజరుకాలేకపోయింది.

నిన్న రాత్రి జరిగిన సంగీత్ లో పరిణీతి-రాఘవ్ తో పాటు ఆహుతులంతా రెట్రో లుక్ లోకి మారారు. 90ల నాటి థీమ్ తో ఈ సంగీత్ ను డిజైన్ చేశారు. పంజాబీ సింగర్ నవరాజ్ హన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పరిణీతి-రాఘవ్ చాన్నాళ్లుగా ఒకరికొకరు తెలుసు. లండన్ లో ఇద్దరూ కలిసి కొన్నాళ్లు చదువుకున్నారు కూడా. ఆ తర్వాత ఎవరి వృత్తుల్లో వాళ్లు బిజీ అయ్యారు. ఆ తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యారు, ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది ప్రారంభంలో తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టారు.