దాదాపు నెల రోజులైనా పఠాన్ హవా ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ ఇండియాతో పాటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వసూళ్లు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా వరల్డ్ వైడ్ కలెక్షన్లలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది. త్వరలోనే ఇండియాలో అత్యథిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా అవతరించబోతోంది పఠాన్.
ఇక టాప్-5 వరల్డ్ వైడ్ గ్రాసర్స్ విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా అత్యథికంగా వసూళ్లు (గ్రాస్) సాధించిన ఇండియన్ సినిమాల టాప్-5 లిస్ట్ లోకి పఠాన్ ఎంటరైంది. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో 1899 కోట్ల రూపాయలతో దంగల్ కొనసాగుతుండగా.. 1700 కోట్ల రూపాయలతో బాహుబలి-2 రెండో స్థానంలో ఉంది.
ఇక 1200 కోట్ల గ్రాస్ తో కేజీఎఫ్2, 1170 కోట్ల రూపాయల గ్రాస్ తో ఆర్ఆర్ఆర్ చిత్రాలు 3-4 స్థానాల్లో కొనసాగుతున్నాయి. పఠాన్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లతో తాజాగా ఐదోస్థానానికి చేరింది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. దంగల్, బాహుబలి-2 సినిమాలు చైనాలో రిలీజ్ అయ్యాయి. ఆ వసూళ్లతో కలిపి అవి టాప్ లో నిలిచాయి. కానీ పఠాన్ సినిమా ఇంకా చైనాలో రిలీజ్ అవ్వకుండానే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది. చైనా వసూళ్లతో కలిపి ఈ సినిమా 2000 కోట్ల రూపాయల క్లబ్ లోకి వెళ్తుందని అంచనా వేస్తోంది ట్రేడ్. అదే కనుక జరిగితే పఠాన్ మూవీ ఎపిక్ రికార్డ్ సృష్టించినట్టే.
ప్రస్తుతానికైతే ఈ సినిమాకు బాక్సాఫీస్ బరిలో ఎలాంటి అడ్డంకుల్లేవ్. తాజాగా వచ్చిన షెహజాదా సినిమా ఫ్లాప్ అయింది. యాంట్ మేన్ ప్రభావం కూడా పెద్దగా లేదు.